మెంతులు

 

గత వారం గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్లో ఒత్తిడికి గురైన అమ్మకాలు, కనుమరుగైన కొనుగోలుదారులతో మెంతుల ధరలు కుంగుబాట పట్టాయి. ఈసారి ఉత్పత్తి సంతృప్తికరంగా ఉన్నందున రైతుల వద్ద మూలుగుతున్న సరుకు సెప్టెంబర్ తర్వాతనే అమ్మకాలు ప్రారంభం కాగలవని వ్యాపారులు భావిస్తున్నందున వరుకు కొనుగోలుకు స్టాకిస్టులు ముఖం చాటేస్తున్నారు. సీజన్ ప్రారంభం కంటే ముందే ధరలు పతనమవుతున్నాయి. 


గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 1500 బస్తాల మెంతులు రాబడిపై మీడియం రూ. 4950-5750, నాణ్యమైన సరుకు రూ.5800-5000, కిరాణా రకం రూ. 5050-6250, జామ్ నగర్ లో 400-500 బస్తాలు యావరేజ్ రూ. -400-4500, మీడియం సరుకు రూ.4900-5000, నాణ్యమైన సరుకు రూ. 5150-5250 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని జాష్రలో గత వారం 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 4500-1500, మీడియం రూ. 5000-5500, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, ప్రొస్టా రూ. 7500-8000, నీమచ్లో 5-6 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 4000–4200, మీడియం రూ. 5000-5200, నాణ్యమైన సరుకు రూ. 6000-6500, బోర్డు సరుకు రూ. 7500-7900, మందసార్లో 500-700 బస్తాలు యావరేజ్ వరుకు రూ. 4500 - 5000, మీడియం రూ. 5500-6000, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని కోణాలో గత వారం 1500-2000 బస్తాల రాబడిపై నాసి రకం సరుకు రూ. 4000–4200, యావరేజ్ రూ. 4500-4800, మీడియం బెస్ట్ రూ. శ్రీ రాజ్ మండీలో 150-200 బస్తాలు మీడియం రూ. 4200-4400, మీడియం బెస్ట్ రకం రూ. 4800-5000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog