రాణిస్తున్న బెల్లం కొనుగోళ్లు

 



 తెలంగాణలో ప్రారంభమైన బోనాల పండుగ డిమాండు అధిగమించేందుకు దిగ్గజ వ్యాపారులచే బెల్లం కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దీని తర్వాత గురు పౌర్ణమి మరియు పండుగల సీజన్. తరుముకొస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రైతులు చౌక ధరతో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కావున బెల్లం ధరలపై కమ్ముకున్న మందగమన ఛాయలు : తొలగినట్లేనని వ్యాపారులు భావిస్తున్నారు. గడిచిన రెండు నెలలుగా ధరలు కేవలం 100-150 ఒడిదొడుకుల మధ్య కదలాడుతున్నదని వ్యాపారులు పేర్కొన్నారు.


ఎందుకనగా, ధరలు తగ్గిన సమయంలో దిగ్గజ వ్యాపారులు మరియు రైతులు తమ సరుకు విక్రయించడానికి ఆసక్తి కనబరచకపోవడమే ఇందుకు నిదర్శనం. దీని వలన ధరలకు మరోసారి మద్దతు లభించినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయికి ధరలు పెరగవని చెప్పవచ్చు. అన్ని బెల్లం ఉత్పాదక రాష్ట్రాలలో సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని శీతల గిడ్డంగులలో బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,12,174 అదనంగా చేరాయి. ఈ సరుకు దీపావళి పండుగ వరకు అమ్మకం కాగలదని సంకేతాలు అందుతున్నాయి. ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 10-12 వేల బస్తాల సరుకు అమ్మకంపై చాకూ బెల్లం రూ. 3190-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో జూన్ 27 నాటికి బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12,08,388 బస్తాల నుండి 1,12,174 బస్తాలు పెరిగి 13,92,562 బస్తాలకు చేరాయి. ఇందులో నాకూ బెల్లం 7,78,124 బస్తాల నుండి 8,25,232 బస్తాలు, కురుపా 12,700 బస్తాల నుండి 14,126 బస్తాలు, రాబిటన్ 1,49,755 బస్తాల నుండి 2,05, 294 బస్తాలు, లడ్డూ బెల్లం 412 బస్తాలు వృద్ధి చెంది 751 బస్తాలకు పెరగగా, చదరాలు 1,01,676 బస్తాల నుండి తగ్గి 1,01,557 బస్తాలు, రస కట్ 62,336 బస్తాల నుండి 36,243 బస్తాలకు పరిమితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి మార్కెట్లో గత వారం 300-400 దిమ్మల నల్ల బెల్లం రాబడి కాగా, రూ. 2300-2500, చిత్తూరులో గత వారం 10-12 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, సురభి రకం రూ. 3800, సూపర్-ఫెన్ రూ. 4200, సాట్నా రకం రూ. 3400, నలుపు రూ. 2400 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని మాండ్యాలో గత వారం 65-70 వాహనాల సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 3000, సింగల్ ఫిల్టర్ రూ. 3100, డబుల్ ఫిల్టర్ రూ. 3300, చదరాలు రూ.3500, శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ.3550-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని లాతూర్ మార్కెట్లో గత వారం 6-7 వేల దిమ్మలు, సోలాపూర్లో 10-12 వేల దిమ్మల సరుకు అమ్మకంపై ఎరుపు-నలుపు మిక్స్ 3000-3100,00 650 г. 3250-3400, of 8-10 30 దిమ్మల బెల్లం రాబడిపై సురభి రకం రూ.3300-3400, గుజరాత్ రకం రూ. 3250–3300, ముంబై రకం రూ. 3450-3500 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 7-8 వేల బస్తాల బెల్లం రాబడిపై ధర రూ.20 తగ్గి రూ. తెలుపు 30 కిలోలు రకం రూ. 1240 -1250, సురభి రకం సరుకు రూ.1220-1240, ఎరుపు రకం రూ. 1200-1230, పిలకలపాలయంలో 5 వేల బస్తాలు సరుకు రాబడిపై ధర రూ. 40-50 తగ్గి తెలుపు రూ.1130-1150, సురభి, ఎరుపు రూ. 1120-1140 మరియు వేలూరులో గత వారం 4-5 వాహనాల బెల్లం రాబడి కాగా, లడ్డు బెల్లం నాణ్యమైన సరుకు రూ. 4200-4300, మీడియం రూ. 3900-4000,నలుపు రకం రూ. 2200-2300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog