46 కోట్ల డాలర్లకు చేరిన ఉల్లి ఎగుమతులు

 


 బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల నుండి ఉల్లికి పెరిగిన డిమాండ్ మరియు లాభసాటి ధరలు లభించినందున 2021-22 లో భారత్ నుండి ఉల్లి ఎగుమతులు డాలర్ రూపేణా గడిచిన మూడేళ్లలో గత ఏడాదితో పోలిస్తే 37.80 కోట్ల డాలర్ నుండి 22 శాతం వృద్ధి చెంది 46 కోట్ల డాలర్లకు చేరగా పరిమాణం దృష్ట్యా స్వల్పంగా తగ్గి 15.37 రి.ట.కు పరిమితమయ్యాయి. భారత్కు 2021-22 లో బంగ్లాదేశ్ అతిపెద్ద కొనుగోలు దేశంగా ముందు వరుసలో నిలిచింది. 2020-21 లో 5.52 ల.ట. ఉల్లి కొనుగోలు చేపట్టగా 2021-22 లో 19 శాతం వృద్ధి చెంది 6.58 ల.ట. దిగుమతి చేసుకున్నది.


విలువ దృష్ట్యా 10.10 కోట్ల డాలర్ నుండి పెరిగి 17.20 కోట్ల డాలర్కు చేరింది.శ్రీలంకకు ఉల్లి ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 1.44 అ.ట. నుండి 1,62 ల, ట, మరియు విలువ దృష్ట్యా 4,41,90,000 డాలర్ నుండి పెరిగి5,53,50,000 డాలర్క ఎగబాకాయి. ఇదే విధంగా నేపాల్కు 1.13 ల.ట.నుండి 1.67 ల.ట. మరియు విలువ దృష్ట్యా 2,22,20,000 డాలర్ నుండి 3,74,30,000 డాలర్కు చేరాయి. మలేషియాకు 2020-21 లో 1.98ల.ట. నుండి పెరిగి 1.70 ల.ట., విలువ దృష్ట్యా 6,19,20,000 డాలర్ నుండి పెరిగి 6,59,30,000 డాలర్కు చేరాయి. భారత్ కు ఉల్లి కొనుగోలు కోసం మరో ప్రముఖ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) భారత ఉల్లి ధరలు పాకిస్తాన్తో పోలిస్తే పురోగమించడం వల 2020-21 లో 1.70 ల.ట.కు గాను ఈసారి తగ్గి 1.22 ల.ట.కు పరిమితమయ్యాయి. ఈ ఏడాది రవాణా ఛార్జీలు ఇనుమడించినందున ద్రవ్య రూపేణా ఉల్లి ఎగుమతులకు మద్దతు లభించిందని వ్యాపారులు పేర్కొన్నారు. చైనాలో ఇటీవల పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది. ఈజిప్టులో కొత్త పంట ముందస్తుగా రాగలదని సంకేతాలు అందుతున్నాయి. తద్వారా పశ్చిమాసియా నుండి భారత ఉల్లికి డిమాండ్ కొరవడగలదని కూడా భావిస్తున్నారు. అయితే,భారత్ నుండి కొనుగోలు చేస్తున్న సంప్రదాయ దేశాల నుండి డిమాండ్కొనసాగుతూనే ఉంటుంది.

Comments

Popular posts from this blog