సమృద్ధిగా పసుపు నిల్వలు - ధరల పెరుగుదలకు అవకాశం లేనట్లే - గత వారం మార్కెట్ ధరలు



 రెండు వారాల క్రితం అంధ్ర - తెలంగాణాలలో భారీ వర్షాలు కురిసినప్పటికీ, పసపు పంటకు ఎక్కువగా నష్టం వాటిల్లలేదు. అయితే, కొందరుల స్పెక్యులేటర్లు పంటకు నష్టం జరిగిందని ప్రచారం చేసి ఏప్రిల్ వాయిదా ధరను రూ. 8800 వరకు పెంచడంలో సఫలీకృతులయ్యారు. కాని, అమ్మ కందారులు పెరగడంతో ధరలు తిరిగి తగ్గి రూ. 8450 కు చేరాయి. ఏప్రిల్ వాయిదా తిరిగి తగ్గి రూ. 7500 వరకు కూడా చేరవచ్చు. ఎందుకనగా, డిసెంబర్ చివరనుండి నిజామాబాద్లో కొత్త సరుకు రాబడి ప్రారంభం కాగలదు. మహారాష్ట్ర సహా దేశంలోని అన్ని ఉత్పాదక ప్రాంతాలలో మరియు పెద్ద నగరాలలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయి మరియు చిన్న స్టాకిస్టులు అమ్మకం కోసం ముందుకు రావడంలేదు. ఎందుకనగా, ఈ ఏడాది మహారాష్ట్రలో విస్తీర్ణం సంతోషజకంగా ఉండడంతో పాటు అనకూల వర్షాలు ఉన్నాయి. తమిళనాడులో కూడా పంట పరిస్థితి మెరుగ్గా ఉంది. ఎందుకనగా, జలాశయాలలో సాగునీటి కొరతలేదు.



గతవారం NCDEX లో సోమవారం పసపు డిసెంబర్ వాయిదా రూ. 7350 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.7600 మరియు ఏప్రిల్ వాయిదా రూ. 8450 తో ముగిసింది.

 నిజామాబాద్లో గతవారం 5-6 వేల బస్తాల రాబడిపై అన్పాలిష్ కొమ్ము రూ. 7000-7400, గట్టా రూ. 6800-7200, పాలిష్ కొమ్ము రూ. 8000-8200, గట్టా రూ. 7600-7700,

 వరంగల్ కొమ్ము రూ. 5800-6200, గట్టా రూ. 5200-5600, కేసముద్రంలో మీడియం కొమ్ము మరియు గట్టా రూ. 4200-5200, 

దుగ్గిరాలలో 1400-1500 బస్తాల రాబడిపై టేకూరిపేట రకం రూ. 6500, కొమ్ము P మరియు గట్టా రూ. 5900-6000, పుచ్చు రకం రూ. 4500-4800 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది. 

మహారాష్ట్రలోని హింగోలిలో సోమ, బుధ, శుక్రవారాలలో కలిసి 20-25 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 7600-7800, మీడియం రూ.6500-6600, నాణ్యమెన గట్టా రూ.7000-7100, మీడియం రూ. 6300-6400,

 నాందేడ్లో 10-12 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 8200-8500, మీడియం రూ. 6800-7000, గట్టా రూ. 7000-7500, 

బస్మత్నగర్ 6-7 వేల బస్తాల అమ్మకంపె నాణ్యమైన కొమ్ము రూ. 7800-8000, మీడియం రూ. 6500-7000, నాణ్యమైన గట్టా రూ.7200-7500, మీడియం రూ. 6700-7000,

 సాంగ్లీలో 4-5 వేల బస్తాల అమ్మకంపె నాణ్యమైన రాజాపురి రూ. 9000-10000, మీడియం రూ. 7000-7600, దేశీ కడప రూ. 6200-6600 ప్రతిక్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

తమిళనాడులోని ఈరోడ్లో గతవారం దాదాపు 18-20 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 8000-8500, మీడియం రూ.6100-6400, నాణ్యమైన గట్టా రూ. 7400-7500, మీడియం రూ. 5500-5600, పెరుందరెలో 1500 బస్తాల రాబడిపై కొమ్ము రూ. 7200-8588,గట్టా రూ. 6469-7688 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog