గత వారం పెరిగిన మిర్చి ధరలు -దక్షిణ భారత్ లో ప్రతికూల వాతావరణ పరిస్తితిలే కారణం

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం గత రెండు వారాలుగా దక్షిణ భారతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం మరియు భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పంటకు చీడపీడల బెడద ఉండడంతో పాటు కర్నూలు ప్రాంతంలో వర్షాల వలన నాట్లు వేసిన పంటకు నష్టం చేకూరింది. రాబోవు రోజులలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో ఆంధ్రలో నిల్వచేసిన రైతులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. దీనితో గుంటూరు మార్కెట్ యార్డులో కోల్డుస్టోరేజీలనుండి మొత్తం సరుకు రాబడులు ముందువారంతో పోలిస్తే కేవలం 70 శాతం ఉండడంతో పాటు మర ఆడించే యూనిట్లు మరియు ఎగుమతిదారులు కొనుగోళ్లతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. ఎందుకనగా, ప్రతి సంవత్సరం ఇదే వ్యవధిలో తెలంగాణా, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో రాబడులు పెరగడం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది ఇంతవరకు రాబడులు పెరగడంలేదు. ఇందుకు ముఖ్యకారణమేమనగా ఎండలు కాయనందున సరుకు ఎండడంలో సమస్యలు ఎదురౌతున్నాయి. దీనివలన మధ్యప్రదేశ్ రైతులకు లాభం చేకూరుతున్నది. ఎందుకనగా, గతవారం బేడియాలో ఆది, బుధ, గురువారాలలో కలిసి 90000-100000 బస్తాల కొత్త సరుకు రాబడి అయినప్పటికీ, ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. 


బేడియాలో మహీ ఫూల్ కట్ రూ.10000-12000, 

తొడిమతో రూ. 7500-8200, 

లాల్కట్ రూ.5500-6000,

 ఫూల్కట్ తాలు రూ. 4500-5500, 

తాలు తొడిమతో రూ. 3000-4000 ధరతో వ్యాపారమయింది. 

        డిసెంబర్ 15 వరకు మందకొడికి అవకాశంలేదు. గతవారం గుంటూరు మార్కెట్ యార్డులో కోల్డుస్టోరేజీలనుండి 2.80 లక్షల బస్తాల సరుకు రాబడికాగా, ఇందులో గుంటూరు ఎసి సరుకు 1 లక్ష బస్తాలు మరియు పరిసర ప్రాంతాల 30000 బస్తాల ఎసి సరుకు కలిసి 1.30 లక్షల బస్తాల ఎసి సరుకు అమ్మకమయింది. ఉత్తర భారతం సహా ఎగుమతి డిమాండ్ ఉండడంతో తేజ డీలక్స్, ఎక్స్ ట్రార్డినరీ డీలక్స్ రకాలు రూ. 1300, సింజెంటా బ్యాడ్లీ, 355 బ్యాడ్లీ, నెం.5 రకాలు రూ. 1500, డిడి, 4884, రోమి రకాలు రూ.700, 577 రకం, 341 రకం రూ. 2000, గత ఏడాది 334, సూపర్-10 రకం, 273, తాలు రకాలు రూ.500, బంగారం, 334, సూపర్ -10 డీలక్స్ రకాలు రూ. 1000, ఆర్మూరు రకాలు రూ. 1200, తేజ తాలు 800, అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 500-800 పెరిగాయి. 

గుంటూరు కోల్డుస్టోరేజీలలో నిల్వ అయిన 

తేజ రూ. 13500-15000, డీలక్స్ రూ. 15100-15300, మీడియం బెస్ట్ రూ.12000-13400, మీడియం రూ. 10000-11900,

 బ్యాడ్లీ - 355 రకం రూ. 13500-17000, డీలక్స్ రూ. 17100-17200,

 సింజెంటా బ్యాడ్లీ రూ. 10000-13500, డీలక్స్ రూ. 13600-13700, డిడి రూ. 12000–14500,

 341 రకం రూ. 12000-15000, డీలక్స్ రూ.15500-16000, నెం.5 రకం రూ. 11500–14000, డీలక్స్ రూ. 14100–14200, 

273 రకం రూ. 11500-13500, బెస్ట్ రూ. 10,500–12,300, డీలక్స్ రూ. 12,400-12,500, మీడియం బెస్ట్ రూ. 9000-10,400, మీడియం రూ. 7500-8900 మరియు 

334 మరియు సూపర్ -10 గత ఏడాది సరుకు రూ. 8500-11500,

 4884 రకం రూ. 10000-12300, 

రోమి మరియు ఆర్మూరు రకాలు రూ. 10000-12200, 

577 రకం రూ. 11000-14000, 

బంగారం రకం రూ. 9500-12000, 

మీడియం మరియు మీడియం బెస్ట్ మరియు అన్ని సీడ్ రకాలు రూ. 10000-11500, 

తేజ తాలు రూ. 7000-8000,

 తాలు రూ. 3500 6500 మరియు

 కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం ప్రాంతాల నుండి దాదాపు 13 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై 

తేజ రూ. 13000-15200,

 341 రకం రూ. 11000-13000,

 డిడి రూ. 12000-12500, 

సింజెంటా బ్యాడ్లీ రూ. 10000-13000, 

సీడ్ రకం నాణ్యమైన సరుకు రూ. 9500-11000, మీడియం రూ. 6000-9000, 

తాలు రూ. 3000-6000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

వరంగల్లో గతవారం 45-50 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 

తేజ రూ. 10000-14500, 

Wonderhot  రూ. 12500-15700, 

341 రకం రూ. 10000-14000, 

273 రకం మరియు దీపికా రూ.10000-13000, 

టమోటా నాణ్యమైన సరుకు రూ. 17500-19000, మీడియం రూ.15500-16000, 

సింగల్పట్టీ రూ. 12000-15100, 

1048 రకం రూ. 10000-12000,

 తాలు రూ. 4000-600 ధరతో వ్యాపారమయింది. 

ఖమ్మంలో గతవారం 34-35 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 

నాణ్యమైన తేజ రూ. 14250, 

మీడియం రూ. 13500-14000,

 తాలు రూ. 6000 ధరతో వ్యాపారమయింది. 

హైదరాబాద్లో గతవారం 3 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ.14000-15000, మీడియం రూ. 12000-13000, నాణ్యమైన సూపర్-10 రకం రూ. 11500-12500, మీడియం రూ. 10000-10500, సి-5 రకం రూ. 12000-13000, తేజ తాలు రూ. 6000-7000, హెబ్రిడ్ తాలు రూ. 3500-4000 మరియు కర్నూలు ప్రాంతం నుండి 2500-3000 బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 11000-12000, బ్యాడ్లీ రూ. 12500–13000, సింజెంటా రూ. 8000-10000, 341 రకం రూ. 8000-13500, 273 రకం రూ. 8000-10000, తాలు రూ. 2000-4500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

మహారాష్ట్రలోని నందూర్ బార్లో దినసరి 3-4 వేల క్వింటాళ్ల కొత్త సరుకు రాబడిపె నిమ్ము రకం బిఎన్ఆర్ రకం రూ. 3000-3300, 5531 రకం రూ. 2500–3000, ఎండురకం లారీ బిల్జీ రూ. 9500-9800 ధరతో వ్యాపారమయింది. 

కర్నాటకలోని బ్యాడ్లీలో మంగళ మరియు గురువారాలలో కలిసి 12–13 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై నాణ్యమైన 5531 రకం రూ. 10500-13000, మీడియం రూ. 8000-9000, 2043 రకం రూ. 11500-13500, జిటి రూ. 8000-9000, తాలు రూ. 4500-5500, నిమ్ము రకం తాలు రూ. 3500-4200 మరియు 15 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 12 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా, ఇందులో నాణ్యమైన డబ్బీ రూ. 21000-23500, మీడియం రూ. 17000-19000, 2043 డీలక్స్ రూ. 18500-20500, మీడియం రూ.15000-17000, 5531 రకం రూ. 11000–12200, తాలు రూ. 4000-4800 ధరతో వ్యాపారమయింది. 

ఛత్తీస్ ఘడ్లో ని జగదల్పూర్ గతవారం 5-6 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపె తేజ మరియు సన్ రకాలు రూ. 10000-14000, 4884 రకం రూ. 9000-11500, తేజ తాలు రూ. 7000-8000 ధరతో వ్యాపారమయింది.











Comments

Popular posts from this blog