అకాల వర్షాలకు మిర్చి పంటకు నష్టం



 ప్రముఖ మిరప ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పంట మరియు పూతపై నల్లి తెగులు సోకడంతో రైతులు పంట పెరికివేస్తున్నారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాల వలన ఆలస్యంగా విత్తిన పంటకు నష్టం వాటిల్లింది. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో వర్షాల వలన పంట కోతలకు అవరోధం ఏర్పడింది. కొందరు వ్యాపారులు ఎగుమతి వ్యాపారుల కోసం ఎడ్వాన్స్ వ్యాపారం చేసారు. ఇందుకోసం కొనుగోలు డిమాండ్ రావడంతో దేశవ్యాప్తంగా ఉత్పాదక రాష్ట్రాలలో మిరప ధరలు రూ. 1000-1500 ప్రతి క్వింటాలుకు పెరిగాయి. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీనితో కొత్త నాణ్యమైన మిరప రాబడి కోసం 2 నెలల సమయం పట్టగలదు. ప్రకాశం జిల్లాలో దిగుబడి తగ్గే అవకాశం కలదు.




వ్యాపారస్తుల అంచనా ప్రకారం ఇతర దేశాలతో పాటు దేశంలోని ఉత్పాదక కేంద్రాలలో సరుకుకు డిమాండ్ పెరగడంతో రాబోవు రోజులలో ధరలు మరో రూ. 800-1000కు పైగా పెరిగే అవకాశం ఉండడంతో తమ సరుకు విక్రయించడం కోసం రెత్తులు, వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. 

ఖమ్మం శీతలగిడ్డంలలో సుమారు 4 లక్షల 68 వేల 700 బస్తాల నిల్వలు ఉన్నట్లు సమాచారం. 

కాగా స్థానిక మార్కెట్లలో వారంలో 30-35 వేల బస్తాల సరుకు అమ్మకంపై 

నాణ్యమైన తేజ రకం రూ. 13,500, 

మీడియం రూ. 12,500 -13,000, 

తాలు కాయలు రూ.6200 ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో మొత్తం 4 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, శీతల గిడ్డంగుల సరుకు 2.35 లక్షల బస్తాల సరుకు విక్రయించ బడింది. ఇందులో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 1.60 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి మరో 75 వేల బస్తాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, సింగాపూర్, చైనా లతో పాటు ఉత్తర భారత దేశం కోసం కూడా డిమాండ్ నెలకొన్నందున తేజ డీలక్స్, ఎక్స్ట్రాఆర్డినరి, సింజెంట బడిగ రకాలలో రూ. 700, మీడియం, మీడియం బెస్ట్ తేజ, డిడి రకాలలో రూ. 1200, బడిగ 355 రకం రూ. 900, ఆర్మూర్, నెం-5 రకానికి రూ. 800 మరియు 341 రకం రూ. 1400 మరియు 273, సూపర్-10, మీడియం, మీడియం బెస్ట్ 334 రకంతో పాటు అన్ని మీడియం, మీడియం బెస్ట్ సీడ్ క్వాలిటీలో రూ. 1000, రోమీ, 577, డీలక్స్ 334, సూపర్-10, 4884, తేజ తాలు రకాలలో రూ. 500, గత ఏడాది సరుకు 334, సూపర్-10, బంగారం రకం ధరలు రూ. 600, తాలు రూ. 300-500 ప్రతి క్వింటాలుకు వృ ద్ధి చెందాయి. గుంటూరు కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన 

తేజ నాణ్యమైన సరుకు రూ. 12,500-13,500, డీలక్స్ రూ. 13,600–13,800, ఎక్స్డినరి రూ. 13,900-14,000, మీడియం బె స్ట్ రూ. 11,500–12,400, మీడియం రూ. 10,000–11,400, 

బ్యాడిగ-355 రూ. 13,000 -15,500, డీలక్స్ రూ. 15,600 -15,700, 

సింజెంట బడిగ రూ. 9000–11,500, డీలక్స్ రూ. 11,600-11,700, 

డిడి రూ. 11,000–13,000, 

341 రకం రూ. 11,000-13,500, డీలక్స్ రూ. 13,600–13,800, 

నెం. 5 రకం రూ.10,000–12,300, డీలక్స్ రూ.12,400–12,600,

 273 రకం రూ. 11,000–13,000, 

334 మరియు సూపర్-10 రూ. 10,000 – 11,200, డీలక్స్ రూ. 11,300 - 11,500, ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 11,600 –11,700, మీడియం బెస్ట్ రూ. 8500 -9900, మీడియం రూ. 7000 8400, గత ఏడాది నిల్వ అయిన 334, సూపర్ -10 రకం రూ.8000 10,600, 

4884 రకం రూ.9000 11,500, డీలక్స్ రూ. 11,600 -11,700, 

రోమీ రకం రూ. 9000 11,500, డీలక్స్ రూ. 11,600 –11,800, 

ఆర్మూర్ రకం రూ. 8500 -10,800,

577 రకం రూ. 10,000-11,500, 

బంగారం రూ. 8500-10,800, మీడియం, మీడియం బెస్ట్, అన్ని సీడ్ రకాలు రూ. 9500-11,500,

 తేజా తాలు కాయలు రూ. 6000-7000, ఇతర రకాల తాలు కాయలు రూ. 3000-6000 ధరతో వ్యాపారమైంది.

 గుంటూరులో గత వారం కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లాలలో కలిసి 10 వేల బస్తాల మిర్చి రాబడిపై నాణ్యమైన తేజ రకం రూ. 12,500–14,000, 355 రకం, బడిగ రూ. 11,500-12,300, నాణ్యమైన డిడి రూ. 11,000-11,500, సీడ్ రకం రూ. 6000-9000, నాణ్యమైన సరకు రూ.9500-11,000, తాలు రూ.2500-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని ఖమ్మంలో గత వారం 30-35 వేల బస్తాలు మరియు వరంగల్లో 25-30 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 9000–13,000, వండర్ హాట్ రూ. 12,500-14,700, 341 రకం రూ. 10,000-12,500, 273 రకం రూ. 10,000-12,000, టమాటా రకం రూ. 12,500-15,500, తాలు కాయలు రూ. 3000-6000 మరియు 6 బస్తాల కొత్త మిరప రాబడిపై తేజ రకం రూ. 11,300 ధరతో వ్యాపారమైంది.

 హైదరాబాద్ లో గత వారం 1400-1500 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ. 13,000, మీడియం రూ. 12,000–12,500, సూపర్-10 రూ. 10,000–10,500, సి-5 రకం రూ. 9000-11,000, తేజ తాలు కాయలు రూ. 6000-6500, హైబ్రిడ్ తాలు కాయలు రూ. 3500-4000 మరియు కర్నూలు ప్రాంతం నుండి 2000-2500 బస్తాల కొత్త మిరప రాబడిపై తేజ రూ. 10,000-12,500, డిడి, 341 రకాలు రూ. 8000-10,500, సింజెంట బడిగ రూ. 8000-10,000, 273 850-9500 3000-4500 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని నందూర్ బార్లో దినసరి 4–5 వేల క్వింటాళ్ల కొత్త సరుకు రాబడి కాగా, బిఎన్ఆర్ రకం నిమ్ము సరుకు రూ. 2200-2400, 5531 రకం రూ. 2100-2200, ఎండు సరుకు లారీ బిల్జీ రూ. 9000-9500 ధరతో వ్యాపారమైంది.

 కర్నాటకలోని బ్యాడ్లీలో సోమ, గురువారాలలో కలిసి 27-28 వేల బస్తాల కొత్త మిరప రాబడిపై 5531 రూ.8500-10,000, మీడియం రూ. 6500-7500, 2043 రూ. 9000-11,000, జిటి రూ. 6000-8000, తాలు కాయలు రూ. 4000-4500 నిమ్ము తాలు సరుకు రూ. 3000-3500 మరియు 35 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 10 వేల బస్తాల అమ్మకం కాగా, డబ్బీ డీలక్స్ ఎసి సరుకు రూ. 21,500-23,000, మీడియం రూ. 18,000-19,000, కెడిఎల్ డీలక్స్ రూ. 18,500–20,000, మీడియం రూ. 14,500–16,000, 2043 డీలక్స్ రూ.12,000-13,000, మీడియం రూ. 8500-10,000, 5531 రకం రూ. 8000-10,000, తాలు కాయలు రూ. 2500-3500 మరియు సింధనూర్లో మంగళవారం నాడు 1000 బస్తాల కొత్త సరుకు రాబడిపై సింజెంట రూ. 9000-10,000, జిటి రూ. 7000-9000, తాలు కాయలు రూ. 2000–3000 మరియు 2 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై సింజెంట రూ. 11,500-12,000, జిటి రూ. 9000-9500, తాలు రూ. 2800–3000 ధరతో వ్యాపారమైంది. 

జగదల్పూర్ గత వారం 6-7 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకం కాగా, తేజా, సన్ రకాలు రూ. 10,000–13,000, 4884 రకం రూ. 9000-11000, తేజతాలు రూ.6000-7000 ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని బేడియాలో ఆది, బుధ, గురు మరియు శుక్ర వారాలలో కలిసి 60-65 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ఎగుమతి డిమాండ్ కారణంగా ధర రూ.800-1000 వృద్ధి చెంది మాహి పుల్కట్ రూ. 10,000-12,500, తొడిమెతో కూడిన సరుకు రూ. 7000-8500, రూ. 6000-7000, ఫుల్ కట్ తాలు రకం రూ. 4500-5500, దండీదార్ తాలు రూ. 3000-4000 ధరతో వ్యాపారమైంది.


బేడియా మార్కెట్లో 250-300 లారీల మిరప ఫార్వర్డ్ వ్యాపారమైనట్లు సమాచారం.

Comments

Popular posts from this blog