గణనీయంగా పెరగనున్న మిర్చి ఉత్పత్తి - ఖమ్మం , వరంగల్ లలో కొత్త మిర్చి రాబడి

 


ఖమ్మంలో గత మంగళవారం 10 బస్తాల కొత్త మిర్చి రాబడిపై ధర రూ. 7011, వరంగల్లో గురువారం 7  బస్తాలు తేజ రూ. 10,500 ధరతో ముహూర్త వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు పంటకు ప్రయోజనం చేకూరుతున్నది.


సాధారణంగా గుంటూరు జిల్లాలో పత్తి సేద్యం 4.60 లక్షల ఎకరాలలో చేపడుతుంటారు. దీనితో పోలిస్తే ఈసారి తగ్గి 2 లక్షల ఎకరాలకు పరిమితమైంది. ఎందుకనగా, మిర్చి సేద్యం గత ఏడాది 1.60 లక్షల ఎకరాలకు గాను 90 వేల ఎకరాలు వృద్ధి చెంది 2.50 లక్షల ఎకరాలకు విస్తరించడమే ఇందుకు నిదర్శనం. తరుచుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం సానుకూలంగా పరిణమించినందున అత్యంత నాణ్యతతో గణనీయమైన ఉత్పత్తి దిగుబడి అవుతున్నది. తద్వారా శీతల గిడ్డంగుల నుండి సరుకు విక్రయాలు జోరందుకున్నాయి. అయినప్పటికీ కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కావడం తథ్యమని స్పష్టమవుతున్నది. కొత్త సీజన్లో ధర తగ్గి 7000-9000 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమయ్యే అంచనాతో మసాలా యూనిట్లు సంవత్సరాంతానికి సరిపడే సరుకు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మరియు దేశంలోని ఇతర ఉత్పాదక కేంద్రాలలో కూడా ఉత్పత్తి గణనీయంగా ఉండగలదని తెలుస్తోంది. కర్ణాటకలోని బ్యాడ్డీలో సోమ మరియు గురువారాలలో కలిసి 60 వేల బస్తాలు, సింధనూర్లో మంగళవారం 1000 బస్తాలు, మధ్య ప్రదేశ్లోని బేడియాలో గత ఆదివారం, బుధవారం, గురువారం కలిసి 75-80 వేల బస్తాలు, ఖమ్మంలో మంగళవారం 10 బస్తాలు, గుంటూరు, కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 8-9 వేల బస్తాలు, వరంగల్లో గురువారం 7  బస్తాల కొత్త మిర్చి రాబడి అయింది. అయితే, వర్షాలు కురిసినందున వాతావరణం చల్లబడడంతో మరో 10 రోజుల తర్వాత రాబడులు పెరగగలవని తెలుస్తోంది. అయితే, గుంటూరులో గత వారం శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 1 లక్ష బస్తాలకు పైగా సరుకు రాబడి అవుతున్నది. గత వారం గుంటూరు గిడ్డంగుల నుండి 6 లక్షల బస్తాలు, వరంగల్లో 40-45 వేల బస్తాలు, హైదరాబాద్లో 10 వేల బస్తాలు, కర్ణాటకలోని బ్యాడ్జీలో 25 వేల బస్తాలు రాబడి కాగా 50 శాతం మేర సరుకు విక్రయించబడింది.


గుంటూరు మార్కెట్ లో గత వారం 6 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, ఇందులో గుంటూరు శీతల గిడ్డంగుల సరుకు 2.15 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి 75 వేల బస్తాలు కలిసి మొత్తం 2.90 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. సింగపూర్, చైనా, బంగ్లాదేశ్ నుండి ఎగుమతి డిమాండ్ నెలకొన్నందున తేజ డీలక్స్, సింజెంట బ్యాడ్లీ, నెంబర్ 5, 355, 334, సూపర్-10, బంగారం రకం, 4884 రకాల ధర రూ. 200, 341, 273 రూ. 300, ఆర్మూర్ రూ. 600 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. కాగా తాలు కాయలు తేజ రూ.300, ఇతర రకాలు రూ. 500 తగ్గగా, మీడియం, మీడియం బెస్ట్ రకాల ధరలు చెక్కుచెదరలేదు. 2019 లో శీతల గిడ్డంగులలో నిల్వ అయిన సరుకు విక్రయాలు జోరందుకున్నాయి.


గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ. 12,000–12,700, డీలక్స్ రూ. 12,800-13,000,ఎక్స్ట్రాడినరి రూ. 13,100–13,300, మీడియం బెస్ట్ రూ. 10,000-11,900, మీడియం రూ. 8500-9900,

 బడిగ-355 రూ. 12,000-14,500, డీలక్స్ రూ. 14,600-14,800, 

సింజెంట రూ. 10,000-11,800,

 341 రకం రూ. 10,000–12,200, డీలక్స్ రూ. 12,300-12,400,

 నెం. 5, రూ. 10,000–11,500, డీలక్స్ రూ. 11,600-11,800, 

273 రూ. 10,000-12,000, 

సూపర్-10 మరియు 334 రూ.9000-10,800, డీలక్స్ రూ. 10,900-11,000, ఎక్స్డినరి రూ. 11,100-11,200, మీడియం బెస్ట్ రూ. 7500-8900, మీడియం రూ.6000–7400,

 సూపర్-10 మరియు 334 గత ఏడాది సరుకు రూ.7000-10,000, 

4884 రూ. 9500-11,200, డీలక్స్ రూ. 11,300-11,400,

 రెమి రూ. 9000-11,000, 

ఆర్మూర్ రకంరూ. 8000-10,000, 

577 రకం రూ. 10,000-11,000, 

బంగారం రకం రూ. 8500-10,000, డీలక్స్ రూ. 10,100-10,200,

 మీడియం, మీడియం బెస్ట్ మరియు అన్ని సీడ్ రకాలు రూ.7000-9800, 

తాలు కాయలు తేజ రూ.5500-6500, 

ఇతర రకాల రూ.3000-5800,

 గుంటూరు యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లాల నుండి 8-9 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై సీడ్ రకం రూ. 6000-9000, డీలక్స్ రూ.9500-11,000, తాలు కాయలు రూ. 3000-5500 ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని ఖమ్మంలో గత వారం 60-65 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,000, మీడియం రూ. 12,000-12,500, తాలు కాయలు రూ. 6000, 

వరంగల్లో 40-45 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 10,000-12,800, వండర్ ట్ రూ. 12,000-14,500, 341 రూ. 9000-11,000, దీపిక రూ. 9500-12,500, డిడి రూ. 8500-10,500, టమాట రూ. 13,000-15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది


హైదరాబాద్లో గత వారం 3-4 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు రూ.13,500, మీడియం రూ. 12,000-13,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 11,000, మీడియం రూ. 10,000-10,500, 341 8⁰. 12,500-13,000, సి-5 రూ. 11,000-12,000, తాలు కాయలు తేజ రూ. 6000-6500, మీడియం రూ. 5000, హైబ్రిడ్ తాలు కాయలు. రూ. 3500-4500, కర్నూలులో 2000-2500 బస్తాల కొత్త మిర్చి రాబడిపై సీడ్ రకం సరుకు రూ. 6000-8000, రూ. 11,000–12,000 ప్రతి క్వింటాలు నాణ్యతానుసారం వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్జీలో సోమ మరియు గురువారాలలో కలిసి 60 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై 5531 రూ. 8000-9200, మీడియం రూ. 6500 - 7500, 2043 రూ. 9000–11,500, జిటి రూ.6000-8000, తాలు కాయలు రూ.4000 4500, నిమ్ము సరుకు రూ.3000-3500 మరియు శీతల గిడ్డంగుల నుండి 7 బస్తాల సరుకు అమ్మకంపై డబ్బీ 15,000-18,000, రూ. కెఎల్ డీలకూ. 17,000-19,000, మీడియం రూ. 14,500-16,000, 2043 12,000–13,000, మీడియం రూ. 9000-11,000, 5531 రకం రూ. 7500-9000, తాలు కాయలు రూ. 2500-3500, సింధనూర్లో మంగళవారం 1000 బస్తాల కొత్త మిర్చి రాబడి పై సింజెంట రూ. 10,000-12,000, 5531 85⁰. 9000-9500, జిటి మీడియం సరుకు రూ.5000-7000, తాలు కాయలు రూ.3000-3500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog