ప్రపంచంలో అత్యధిక పామాయిల్ వినియోగిస్తున్న భారత్ ఇండోనేషియా నుండే 50 శాతానికి పైగా సరుకు దిగుమతి చేసుకుంటున్నది. అయితే, తాజాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల నుండి దిగమతి అయ్యే సన్ ఫ్లవర్ నూనె సర ఫరా కుంటుబడినందున దీనిని భర్తీ చేసేందుకు భారత్కు మరింత అదనపు సరుకు ఎగుమతి చేయాలని ఇండోనేషియా కోరుతున్నది. ఎందుకనగా, ఇండోనేషియా తమ దేశంలో స్థానికంగా ధరలు అదుపు చేసేందుకు జనవరి 27 నుండి ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అప్పటి నుండి ముడిపామాయిల్ దిగుమతి వ్యయం 38 శాతం వృద్ధిచెందింది. దీని వలన ఇతర వంటనూనెల ధరలు కూడా ప్రభావితమయ్యాయి.
రష్యా దాడి మరియు దక్షిణ అమెరికాలో నెలకొన్న అనావృష్టి పరిస్థితులతో భారత్కు పామాయిల్ సరఫరా కొరవడింది. ఎందుకనగా, గత ఏడాది రష్యా మరియు ఉక్రెయిన్లల నుండి కలిసి భారత్కు 16 ల.ట. సన్ఫ్లవర్ నూనె సరఫరా చేశాయి. అయితే, తాజాగా దిగుమతులు నిలిచిపోయాయి. ప్రపంచ సన్ఫ్లవర్ నూనె ఉత్పత్తిలో 60 శాతం మరియు ఎగుమతులలో 76 శాతం భాగస్వామ్యం కలిగివున్న బ్లాక్-సీ దేశాల నుండి సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వంటనూనెల ధరలు నింగికెగిసి పడుతున్నాయి. ఇందులో పామాయిల్ తర్వాత అత్యధికంగా వినియోగించే సోయానూనె ధర 29 శాతం ఇనుమడించాయి.
భారత మొత్తం వంటనూనెల దిగుమతులలో పామాయిల్ భాగస్వామ్యం 60 శాతానికి పైగా ఉంది. ఇండోనేషియా నుండి పామాయిల్ ఎగుమతులు పెంచేందుకు భారత ఉన్నతాధికారులు ఇండోనేషియా అధికారులతో నిర్వహించిన వర్చువల్ (కాల్పనిక) సమావేశంలో చర్చించారు. ఫలితంగా భారత్కు తాత్కాలికంగా ఎగుమతులు పెంచేందుకు పెట్రోల్లో బయో-డీజిల్ మిళితం తగ్గించాలని ఇండోనేషియా ప్రభుత్వం తమ అధికారులను ఆదేశించింది. గడిచిన ఎనిమిది నెలలలో భారత ప్రభుత్వం నాలుగుసార్లు దిగుమతి సుంకం తగ్గించింది.
విదేశాల నుండి ముడినూనెలతో పాటు రిఫైండ్ నూనెలకు కూడా అనుమతించినప్పటికీ దేశంలో వంటనూనెల ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. దక్షిణ అమెరికా దేశాలు మరియు అమెరికా నుండి సోయానూనె, యూరప్ దేశాల నుండి ఆవనూనె దిగుమతులు పెంచేందుకు చర్యలు చేపడుతున్నది. అయితే, ఇప్పటికిప్పుడే సరుకు అందుబాటులోకి రావడం కష్టతరమై పనే అని చెప్పవచ్చు. ఎందుకనగా ఇక్కడ కూడా పరిమిత స్థాయిలో అందుబాటులో ఉన్న సరుకు మరియు పెరిగిన దూరం. కావున ప్రస్తుతం పామాయిల్ తక్షణమే సరఫరా చేసే అవకాశం ఉంది. ఒక్క భారత్కు మాత్రమే పామాయిల్ సరఫరా పెంచేందుకు ఇండోనేషియా అనుమతి మంజూరు చేసింది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు