పెరిగిన వంటనూనెల దిగుమతులు - తగ్గిన పామాయిల్ ధరలు

 

సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్ల సమాఖ్య వారి వివరాల ప్రకారం ప్రస్తుత వంటనూనె సంవత్సరం మొదటి ఐదు నెలలు అనగా నవంబర్, 2021 నుండి మార్చి, 2022 లో వంటనూనెల దిగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 52.40 లక్షల టన్నుల నుండి 4 లక్షల టన్నులు పెరిగి 56.42 లక్షల టన్నులకు చేరాయి. ఇందులో మార్చి, 2022లో దిగుమతులు ఫిబ్రవరితో పోలిస్తే 9.83 లక్షల టన్నుల నుండి 68,000 టన్నులు పెరిగి 10,51,000 టన్నులకు చేరాయి.


ఆర్బిడి పామోలిన్ దిగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 24,101 టన్నుల నుండి పెరిగి 7,71,000 టన్నులకు చేరగా, ముడి పామా యిల్ దిగుమతులు 29,95,000 టన్నుల నుండి తగ్గి 18,47,000 టన్ను లకు చేరాయి. ఇదే విధంగా ముడి సోయానూనె దిగుమతులు 12.32 లక్షల టన్నుల నుండి పెరిగి 19.33 లక్షల టన్నులకు, పామాయిల్ మరియు సాఫ్టా యిల్స్ దిగుమతులు అనుపాతంలో పామాయిల్ దిగుమతులు 30.90 లక్షల టన్నుల నుండి తగ్గి 26.59 లక్షల టన్నులకు ( 47 శాతం) చేరాయి మరియు మరోవైపు సాఫ్టాయిల్స్ దిగుమతులు 21,49,000 టన్నులు ( 41 శాతం ) నుండి పెరిగి 29,89,000 టన్నులు ( 53 శాతం ) చేరాయి.


మార్చి, 2022 లో ఆర్బిడి పామోలిన్ ధర ఫిబ్రవరితో పోలిస్తే 1581 డాలర్ల నుండి పెరిగి 1812 డాలర్లకు చేరగా, ముడి పామాయిల్ ధర 1594 డాలర్ల నుండి పెరిగి 1828 డాలర్లు ప్రతిటన్నుకు చేరింది మరియు నవంబ ర్-మార్చి, 2021-22లో మలేషియా నుండి ముడిపామాయిల్ దిగుమతులు 11.52 లక్షల టన్నులు, ఆర్బిడి పామోలిన్ దిగుమతులు 2.89 లక్షల టన్నులు మరియు ఇండోనేషియా నుండి ముడిపామయాల్ దిగుమతులు 5.01 లక్షల టన్నులు మరియు ఆర్బిడి పామోలిన్ దిగుమతులు 4.74 లక్షల టన్నులు ఉన్నాయి. ఇదేవిధంగా అర్జెంటీనా నుండి ముడి సోయా డిగమ్ నూనె దిగుమ తులు 12.60 లక్షల టన్నులు మరియు బ్రెజిల్ నుండి 4.28 లక్షల టన్నుల సరుకు దిగుమతి అయింది. వంటనూనెల సంవత్సరం మొదటి ఐదు నెలలలో దిగుమతులు 53.75 లక్షల టన్నుల నుండి పెరిగి 57.95 లక్షల టన్నులకు చేరాయి. ఇందులో మార్చి, 2022లో వంటనూనెలు మరియు ఇతర అఖాద్య నూనెలు కలిసి మొత్తం దిగుమతులు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 9.80 లక్షల టన్నుల నుండి పెరిగి 11.04 లక్షల టన్నులకు చేరాయి.



తగ్గిన పామాయిల్ వాయిదా ధరలు


 మలేషియా పామాయిల్ బోర్డు ( ఎంపిఎబి) వారి వివ రాల ప్రకారం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మార్చిలో ముడి పామాయిల్ ఉత్పత్తి అక్టోబర్ తరువాత మొదటిసారిగా ఫిబ్రవరితో పోలిస్తే 24 శాతం పెరిగి 14.10 లక్షల టన్నులకు చేరాయి. అయితే, కొను గోలు చురుకుగా ఉండడంతో ఎగుమతులు కూడా 14.1 శాతం పెరిగి 12.70 లక్షల టన్నులకు చేరడంతో మాసాంతంలో పామాయిల్ నిల్వలు ఫిబ్రవరితో పోలిస్తే 2.99 శాతం తగ్గి 14.70 లక్షల టన్నులకు చేరాయి. నగా, మార్చి, | 2021 తరువాత నిల్వలు కనీస స్థాయిలో ఉన్నాయి. అయితే, బుర్సా మలే షియా డెరివేటివ్స్ ఎక్స్ఛేంజిలో ముడిపామాయిల్ జూన్ వాయిదా ధర 43 రింగి లేదా 0.7 శాతం తగ్గి 6134 రింగిట్ (1451.15 డాలర్లు) ప్రతి టన్నుకు చేరింది. ఎందుకనగా, ఏప్రిల్లో ఎగుమతులు తగ్గే అవకాశం కలదు. కార్గో సర్వేక్షణ సొసైటీ జనరల్ సర్వేలెంస్ వారి వివరాల ప్రకారం 1-10 | ఏప్రిల్, 2022 లో మలేషియా నుండి పామాయిల్ ఉత్పత్తుల ఎగుమతులు | గత నెల ఇదే వ్యవధితో పోలిస్తే 20.7 శాతం తగ్గాయి.


బుర్సా మలేషియా డెరివేటివ్స్ ఎక్స్ఛేంజిలో ముడిపామయిల్ జూన్ | వాయిదా 43 రింగిట్ లేదా 0.7 శాతం తగ్గి 6134 రింగిట్ (1451.15 డాల ర్లు) ప్రతిటన్నుకు చేరింది. వ్యాపారస్తుల కథనం ప్రకారం పామాయిల్ అధిక ధరతో ప్రారంభమైనప్పటికీ, ఏప్రిల్లో ఎగుమతులు తగ్గుచున వత్తిడి పడింది. సిబిఒటిలో సోయానూనె 0.2 శాతం తగ్గడంతో, పామాయిల్ వాయిదా ధర 6326 రింగిట్పై ప్రతిరోధ స్థితికి అవకాశం కలదు. అయితే, | పటిష్టంగా ఉంటే 6454-6548 రింగిట వరకు చేరవచ్చు.

Comments

Popular posts from this blog