కనివినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్న ముడి పామాయిల్ ధరలు

 


 ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద పామాయిల్ ఉత్పాదక దేశoగా మలేషియా ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ పామాయిల్ సరఫరాలో ఇరు దేశాల భాగస్వామ్యం కలిసి 85 శాతం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో ప్రతికూల వాతావరణంతో సోయా పంటకు వాటిల్లిన నష్టం మరియు ఉక్రెయిన్పై రష్యా దాడితో ముడిపామాయిల్ ధరలు నింగికి దూసుకెళ్తున్నాయి. ఈ ప్రభావం ప్రపంచ పామాయిల్ మరియు సోయానూనెపై దుష్ప్రభావం పొడసూపుతున్నది.


ముడి పామాయిల్ మరియు ఇతర వంటనూనెల ధరలు బలపడినందున ఫిబ్రవరి 23న మునుపెన్నడూ లేనంతగా మలేషియా కమాడిటీ డెరివేటివివ్స్ ఎక్స్ంజి వద్ద పామాయిల్ వాయిదా ధర ప్రతి టన్ను 6000 రింగిట్ (1433.52 డాలర్) అధిగమిస్తూ బుధవారం మధ్యాహ్నం మే వాయిదా పెరిగి 6043 రింగిన్ను తాకిన తర్వాత చివరగా 5981 రింగిట వద్ద స్థిరపడింది. సిబిఒటి వద్ద సోయానూనె ప్రభావం పామాయిల్పై పొడసూపుతున్నదని విశ్లేషకులు తమ అభిప్రాయం వెల్లడించారు.


ఇండోనేషియాలో పామాయిల్ ఉత్పత్తి కుంటుపడినందున ఎగుమతులపై నియంత్రణ విధించినందున మలేషియా నుండి ఫిబ్రవరిలో పామాయిల్ ఎగుమతులు భారీగా వృద్ధి చెందాయి. ఫలితంగా నిల్వలు జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అడుగంటే అంచనాతో మలేషియా పామాయిల్ వాయిదా బలపడటానికి దోహదమైంది. ఫిబ్రవరి 22న చికాగో బోర్డ్ ఆఫ్ ట్రేడ్ (సిబిఒటి) వద్ద సోయానూనె మే వాయిదా సుమారు 3 శాతం ఇనుమడించి ప్రతి పౌండు 70 సెంట్లకు చేరింది. ప్రస్తుతం చైనాలో నిల్వలు 3,65,100 టన్నుల నుండి పెరిగి తగ్గి 3,40,000 టన్నులకు పరిమితమైనట్లు వారాంతపు నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ కొనుగోళ్లు పరిమితం చేసే అవకాశం కనిపిస్తున్నది.


వరి స్థానంలో ఆయిల్-పామ్ సేద్యానికి ప్రోత్సాహం


 ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పామ్ సేద్యం 1.81 ల.హె.కు విస్తరించి ప్రతి హెక్టారు దిగుబడి 19.81 టన్నుల ఉత్పత్తితో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు ఉద్యాన శాఖతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు. గొట్టపు బావుల ద్వారా వరి సేద్యానికి బదులు ఆయిల్-పామ్ సేద్యానికి తోడ్పాటు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎందుకనగా, 1.12 ల.హె.లో ఆయిల్-పామ్ సేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడమే ఇందుకు నిదర్శనం. ఇందుకోసం మెట్ట భూములను గుర్తించినట్లు పేర్కొన్నారు. 2020-21 లో రాష్ట్రంలో 8801 హెక్టార్లు అందుబాటులోకివచ్చాయి. ఇందుకోసం ప్రభుత్వం 30.61 కోట్లు ఖర్చు చేసింది.


2021-22 కోసం 81.45 కోట్లు ఖర్చు చేసేందుకునిర్ణయించింది.ఆయిల్-పామ్ సేద్యం కోసం తోడ్పాటు నందిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర సర్కారు అదనపు ఆర్థిక సాయం సిద్ధంగా ఉంది. ఇందుకోసం అధికారులు సమగ్రమైన చర్యలు చేపట్టవలసి ఉంది.ధాన్యానికి అదనంగా సాంబా సీజన్లో 5858 ఎకరాలలో మినుములు, 38,710 ఎకరాలలో పెసలు మరియు 400 ఎకరాలలో పత్తి సేద్యం చేపట్టబడింది. ఇందుకోసం 44,196 కిలోల మినుము విత్తులు, 32,073 కిలోల పెసల విత్తులు పంపిణీ చేయబడ్డాయి. అంతేకాకుండా సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉన్నట్లు మంత్రి తెలిపారు.



Comments

Popular posts from this blog