తగ్గిన పత్తి సేద్యం - ధరలు పెరిగే అవకాశం

 

03-10-2021

ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 16 వరకు దేశంలో పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 126.97 ల.హె. నుండి తగ్గి 119.66 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన తమ గణాంకాలలో పేర్కొన్నది. 


ఇందులో మహారాష్ట్రలో 42.25 ల.హె. నుండి తగ్గి 39.41 ల.హె., 

గుజరాత్లో 22. 79 ల.హె. నుండి 22.51 ల.హె., 

తెలంగాణలో 24.13 ల. హె . నుండి 20.69 ల.హె.,

 హర్యాణాలో 7.37 ల.హె. నుండి 6.88 ల.హె., 

కర్ణాటకలో 6.88 ల.హె. నుండి 6.36 ల.హె., 

మధ్య ప్రదేశ్లో 6.44 ల.హె. నుండి 6.15 ల.హె., 

ఆంధ్రప్రదేశ్లో 5.64 ల.హె. నుండి 4.86 ల.హె.కు పరిమితం కాగా 

రాజస్తాన్లో 6.68 ల.హె. నుండి 7.08 ల.హె.కు,

 పంజాబ్లో 2.51 ల.హె. నుండి 3.03 ల.హె.కు విస్తరించింది.

ఉత్తర భారత్తో పాటు కర్ణాటక, తెలంగాణ మార్కెట్ లో కొత్త పత్తి రాబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రతి రోజు సుమారు 10 వేల బేళ్లకు పైగా రాబడి అవుతున్నది. ఇందులో అత్యధిక సరుకు ఉత్తరాది రాష్ట్రాల నుండి నమోదవుతున్నది. వివిధ మార్కెట్లలో సరుకు నాణ్యత మరియు నిమ్ము శాతం అనుసరించి ప్రతి క్వింటాలు ఆధార ధర రూ. 6400 – 7000 పలుకుతోంది. ఇది కనీస మద్దతు ధరతో పోలిస్తే గరిష్ఠమని చెప్పబడు చున్నది. ఉత్తర భారత్లో 12–14 శాతం నిమ్ముగల పత్తికి రూ. 6000 – 7000 ధరతో వ్యాపారమ వుతున్నది. నవంబర్ వరకు ఇదే ఒరవడి కొనసాగగలదని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు. 2020-21 సీజన్ (సెప్టెంబర్ 30) ముగిసే నాటికి మిగులు నిల్వలు 82.50 లక్షల బేళ్లు ఉండగలవని సిఎఐ భావిస్తున్నది.


ఉత్తర భారత్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు ప్రయోజనం చేకూరుతున్నట్లు వ్యాపారులు తెలిపారు. తద్వారా ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 65 లక్షల బేళ్ల నుండి భారీ వృద్ధి నమోదు చేసే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్లో కూడా స్వల్పంగా కొత్త పత్తి రాబడులు ప్రారంభ మయ్యాయి. నవంబర్ 15 నుండి భారత పత్తి సంస్థ (సిసిఐ) కొనుగోళ్లు చేపట్టే అవకాశం ఉంది. అయితే, మద్దతు ధరతో పోలిస్తే అధిక ధరతో వ్యాపారమవు తున్నందున సిసిఐ కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండబోవని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు