కొత్త సీజన్లో పత్తి మందగమనం



 ఈ ఏడాది దేశంలో పత్తి లభ్యత తగ్గినందున దాదాపు సగం నూలు మిల్లులు మూత పడినందున ఆందోళనకు గురవుతున్న కేంద్ర సర్కారుకు ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, విస్తరించిన పత్తి సేద్యం, సానుకూల వాతావరణం వలన 2022-23 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్లో ఉత్పత్తి 15 శాతం వృద్ది చెందగలదనే సంకేతాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో ఇప్పటి వరకు పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 120.55 ల.హె. నుండి పెరిగి 1.28 ల.హె. విస్తరించింది. 


ఈసారి వాతావరణంసానుకూలంగా పరిణమిస్తున్నందున దిగుబడులు ఇనుమడించి ఉత్పత్తి రాణించగలదని భారత పత్తి సంస్థ (సిసిఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ అర్జున్ దేవ్ జంలోని ఖాన్ దేశ్ జిన్ ప్రెస్ అసోసియేషన్ నిర్వహించిన ఇండియా మీట్ ఆన్ కాటన్ ట్రేడ్ సమావేశంలో తమ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఉత్పత్తి 3.60 కోట్ల బేళ్లకు చేరవచ్చని తమ అభిప్రాయం వెల్లడించారు. పాత సరుకు నిల్వలు అడుగంటినందున సీజన్ ప్రారంభంలో ధరలు కుంగుబాట పట్టినప్పటికీ తదుపరి పురోగమనం చెందగలవని అన్నారు. వస్త్ర పరిశ్రమ తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేయగలదు. కొనుగోళ్లు ముగిసిన వెంటనే ధరలు డీలా పడిన తర్వాత నూలు మిల్లుల కొనుగోళ్లతో ధరలు చైతన్యం చెందగలవు. ఎందుకనగా కొన్ని ప్రాంతాలలో అతివృష్టి వలన పంటకు నష్టం కూడా వాటిల్లడమే ఇందుకు ప్రధాన కారణం. పంజాబ్, హర్యాణాలో ఉత్పత్తి అంచనాను చేరుకునే అవకాశం కనిపించడంలేదు. స్టాకిస్టుల కొనుగోళ్లు మరియు ఎగుమతి డిమాండ్ కూడా ఉండగలదు. ఈ ఏడాది జనవరిలో పత్తి ప్రతి కండీ (356 కిలోలు) రూ. 60,000 పలికిన ధర మే నెలలో పెరిగి రూ. 1,10,000 కు ఎగబాకింది.

సిసిఐ నుండి పత్తి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న స్పిన్నింగ్ మిల్లులు 

 ఈ ఏడాది పత్తి ధరలు తగ్గే అవకాశం లేదు. ఎందుకనగా, దేశంలో మిగులు పూర్తిగా హరించుకుపోవడమే కాకుండా పాకిస్తాన్ లో కుంటుపడడమే ఇందుకు ప్రధాన కారణం. కావున భారత్ నుండి ఎగుమతులు ఇనుమడించే అవకాశం లేకపోలేదు. 4 దక్షిణాదిలోని స్పిన్నింగ్ మిల్లులు ముఖ్యంగా తమిళనాడు మిల్లర్లు అక్టోబర్ నుండి ప్రారంభమయ్యే పత్తి సీజన్ లో భారత పత్తి సంస్థ (సిసిఐ) నుండి వ్యాపారులకు బదులు నేరుగా మిల్లర్లకే విక్రయించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎందుకనగా ఈసారి సిసిఐ రైతుల నుండి కనీస మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయనందున ప్రస్తుత సీజన్ లో ప్రతి కండీ రూ. 75,000 కు పైగా వెచ్చించి కొనుగోలు చేయవలసి వచ్చిందని మిల్లర్లు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వ్యాపారులు మరియు బహుళార్ధసాధక కంపెనీలు ప్రస్తుత సీజన్ (2021 అక్టోబర్ - 2022 సెప్టెంబర్) లో భారీగా సరుకు నిల్వ చేశాయి. తద్వా రా మే నెలలో ధర పెరిగి ప్రతి కండీ రూ. 1,00,000 కు ఎగబాకింది. - మిల్లులకు నాణ్యమైన పత్తి సరసమైన ధరకు లభ్యం కాలేదు.

న్యూయార్క్ ఐసిఇ ఎక్స్ంజి వద్ద పత్తి ప్రతి పౌండు ధర తగ్గి 1000 కు పరిమితమైనందున అక్టోబర్ వాయిదా 93.54 సెంట్లు (ప్రతి కండీ ధర రూ.59,200) మరియు డిసెంబర్ వాయిదా 93.33 సెంట్లు (కండీ ధర రూ. 50,075) - కు దిగజారింది. తద్వారా భారత్ లో పత్తి ధర తగ్గి ప్రతి కండీ రూ. 75,000–76,000 వద్ద కదలాడుతున్నది. పత్తి మిల్లర్లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యను - తమిళనాడు స్పిన్నింగ్ మిల్లుల సమాఖ్య కేంద్ర సర్కారు ముందు ప్రతిపాదించినట్లు - పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. మిల్లర్ల శ్రేయస్సు కోసం పత్తి కొనుగోళ్లు చేపట్టే అవకాశం లేదని, అయితే వృతిపరమైన స్థాయిలో కొనుగోలు చేయవచ్చని - సిసిఐ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయితే, వచ్చే సీజన్ కోసం పొట్టి పింజ - పత్తి ప్రస్తుత సీజన్ కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5726 నుండి పెంచి రూ. 6080 నిర్ధారించ బడింది. అయితే, రైతుల పరిస్థితి పరిగణన లోనికి తీసుకున్నట్లయితే స్వేచ్ఛా విపణిలో కనీస మద్దతు ధర కన్నా తగ్గే అవకాశం - కనిపించడం లేదు. దేశంలో కొత్త పంట సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి. - ఈ ఏడాది అత్యధిక మార్కెట్ లలో ప్రతి క్వింటాలు రూ. 8000 నుండి పెరిగి రూ. - 8434 ధరతో వ్యాపారమవుతున్నది. ఈ ఏడాది రైతులకు ప్రతి క్వింటాలు ధరరూ. 12,000 గిట్టుబాటైనందున ఈసారి ధర రూ. 8000 కన్నా దిగువకు పడిపోయే - అవకాశం లేదు. అయితే, ఉత్పాదక రాష్ట్రాలలోని వ్యాపారులు ప్రతి క్వింటాలు ధర రూ. 10,000 అధిగమించగలదని తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనగా, మిల్లుల నుండి నెలకొన్న డిమాండ్ మరియు దిగ్గజ రైతులు తమ సరుకును తక్షణమే విక్రయించేందుకు ఆసక్తి కనబరచకపోవడమే ఇందుకు ఉదాహరణ. 2021 జనవరిలో పత్తిపై 11 శాతం దిగుమతి సుంకం విధించబడింది. అయితే దేశీయ ధరలు ఇనుమడించడంతో మిల్లులకు దిగుమతి సుంకం నుండి మినహాయింపు లభించింది. అయితే, ఈ మినహాయింపు అక్టోబరు 31 తో ముగియనున్నది.

Comments

Popular posts from this blog