పత్తి రాబడులు పెరిగే అవకాశం - ఎగుమతికి డిమాండ్

 
13-10-2021

పత్తి వ్యాపారులు అన్ని విధాల ఆలోచించి సరుకు నిల్వ చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకనగా, 2021-22 సీజన్ కోసం దేశంలో రబీ, యాసంగి పంటల ఉత్పత్తి పెరగడంతో పాటు మద్దతు ధర రూ. 5726 కంటే మార్కెట్ ధరలు అధికంగా ఉన్నందున 2022-23 లో కూడా రికార్డు ఉత్పత్తికి అవకాశం కలదు.


వ్యాపారస్తుల అంచనా ప్రకారం ఈ ఏడాది పంట విత్తే సమయంలో వర్షాభావ పరిస్థితుల వలన పంట విత్తడం ఆలస్యం కావడంతో పాటు విస్తీర్ణం తగ్గింది. దీని తరువాత అధిక వర్షాల వలన పంటకు నష్టం కూడా వాటిల్లింది. అయితే, ప్రస్తుతం భూమిలో తేమ అధికంగా ఉన్నందున ఈ ఏడాది సీజన్ లో కోతలు 2-3 విడతలకు బదులుగా 4 విడతలు ఉండే అవకాశం కలదని రైతులు అంచనా వేస్తున్నారు. ఎందుకనగా, ఆలస్యంగా పంట విత్తిన ప్రాంతాలలో పంటకు లాభం చేకూరుతున్నది. కోతలు సాధారణంగా నవంబర్ చివర లేదా డిసెంబర్ అయిన తరువాత రబీ సీజన్ కోసం గోధుమ, శనగ, ఆవ పంటలను విత్తడం జరుగుతుంది. అయితే, గుజరాత్లో కొత్త సరుకు ధర రూ. 7000-7500 లకు చేరడంతో కోతలు 4 విడతలలో ఉండే అవకాశం ఉంది మరియు ఉత్పత్తి పెరగవచ్చు. ఇంతకు ముందు గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన ఉత్పత్తి తగ్గగలదని అంచనా వేయడం జరిగింది. అయితే, ప్రస్తుతం ప్రస్తుత సీజన్ ( అక్టోబర్, 2021 నుండి సెప్టెంబర్, 2022) లో ఉత్పత్తి ముందు అంచనా 354.50 లక్షల బేళ్ల తో పోలిస్తే పెరిగి 360 లక్షల బేళ్లకు చేరే అవకాశం కలదు.


తెలంగాణాలో ప్రస్తుత సీజన్ కోసం విస్తీర్ణం 13 శాతం తగ్గింది. అయితే, అనుకూల వాతావరణ పరిస్థితులతో సరుకు నాణ్యంగా ఉండే అవకాశం కలదు మరియు కోతలు 2-3 విడతలకు బదులుగా 4 విడతలు ఉంటే, రబీ సీజన్ కోసం వరి లేదా మొక్కజొన్న మొదలగు పంటల విస్తీర్ణం తగ్గగలదు.


సిఎఐ వర్గాల కథనం ప్రకారం సెప్టెంబర్లో వర్షాల కారణంగా 5-10 శాతం పంటకు నష్టం వాటిల్లింది. కాని దీని తరువాత పంట పరిస్థితి మెరుగయింది. నవంబర్- డిసెంబర్ తరువాత మూడవ లేదా నాల్గవ విడత కోతలకు అవకాశంకలదు.


లభించిన సమాచారం ప్రకారం బంగ్లాదేశ్, చైనా, వియత్నాంలకోసం ఎగుమతి డిమాండ్ వచ్చే అవకాశం కలదు. అయితే, ప్రస్తుతం ధరలు అధికంగా ఉన్నందున ఎగుమతుల కోసం అడ్వాన్స్ వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 5-7 లక్షల బేళ్లకు బదులుగా 2 లక్షల బేళ్ల వ్యాపారం 98-105 సెంట్ ప్రతి పౌండ్ ధరతో వ్యాపారమయింది.


లభించిన సమాచారం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే, ఎగుమతులు పెరిగే అవకాశం కలదు.


ప్రస్తుతం రాజస్తాన్ నుండి కొత్త పత్తి 28మి.మీ. రూ.54500 -55000 నుండి పెరిగి రూ. 56000 -56500 మరియు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతపు 10 శాతం నిమ్ము సరుకు రూ. 59000-59500, 29 మి.మీ. రూ.60500-61500 ప్రతికండీ ధరతో వ్యాపారమయింది. గతవారం ఉత్తర భారతంలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 90-95 వేల బేళ్ల సరుకు రాబడి కాగా, మొత్తం సరకు అమ్మకమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు