హెచ్చుముఖంలో పత్తి ధరలు - పత్తి భవిష్యత్తు రూ. 15000
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడంతో పత్తి ధరలు దూసుకు పోతున్నాయి. మరియు భవిష్యత్తులో ధరలు మరింత వృద్ధిచెంది రూ. 15,000 ప్రతి క్వింటాలును మించి ఉండగలదని వ్యాపారస్తుల భోగట్టా.
తెలంగాణలో గత వారం కేవలం 8000 బేల్ల పత్తి రాబడి కాగా, వరంగల్లో రూ. 10,000-10,025, 29 మి.మీ. ప్రతి ఖండీ రూ. 90,500-95,500, 30 మి.మీ. రూ.95,500-96,600, భైంసాలో రూ. 90,000-90,500, ఖమ్మంలో 2500 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 12,300, మీడియం రూ. 11,000-11,500 ధరతో వ్యాపారమెంది. ఆంధ్ర ప్రదేశ్లో 800-1000 బేళ్ల సరుకు రాబడి అయింది. ఇందులో గుంటూరులో 8500 -12,240, 29 మి.మీ. 90,000 -94,000 మరియు ఆదోనిలో. 90,000 -94,000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.
మహారాష్ట్రలోని 10 వేల బేళ్ల సరుకు రాబడి కాగా, పత్తి రూ. 11,000-12,200, నాగ్పూర్ 30 ఎమ్.ఎమ్. రూ. 94,500-95,000, 29 ఎమ్.ఎమ్. 63,500-64,500 మరియు గుజరాత్లో 10-12 వేల బేళ్ల పత్తి రాబడి కాగా, రూ. 9000–12,500, ఎ-గ్రేడ్ రకం రూ. 91,000-92000, బి-గ్రేడ్ రూ. 90,000-91,000, యావరేజ్ రూ. 88,000-89,000 మరియు
రాజస్తాన్లో 500-600 బేళ్ల సరుకు రాబడి కాగా, పత్తి రూ.8000-10,000, గింజలు రూ. 3800-4200, మరియు కర్ణాటకలోని ఉత్పాదక కేంద్రాల వద్ద 700 బేళ్లరాబడికాగా, వత్తిదూ.11,000–13,000, గింజలు రూ. 4000-4600 ప్రతి క్వింటాలు మరియు 30 ఎమ్.ఎమ్. రూ. 93,500-95,000, 29 ఎమ్.ఎమ్. రూ. 89,000-91,000 ప్రతి ఖండీ ధరతో వ్యాపారమెంది.
పత్తి భవిష్యత్తు రూ. 15000
యవత్మాల్ - ఈ సమాచార పత్రిక మాధ్యమంగా దీపావళి తరువాత ఉత్పత్తి తగ్గుచున్నందున పత్తి భవిష్యత్తు రూ. 12000 దాటగలదని అంచనా వ్యక్తం చేయడం జరగగా, అది వాస్తవరూపం దాల్చింది.యవత్మాల్ ప్రాంతపు పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనగా ధర గత ఏడాదితో పోలిస్తే రూ. 6000-7000 ప్రతి క్వింటాలు నుండి దాదాపు రెట్టింపె శనివారం నాటికి రూ. 11,700-11,800 వరకు చేరింది. కర్ణాటకలో రూ. 11,000-13,000 వరకు చేరే అంచనా కలదు.
పంట విత్తడం కోసం మూడు నెలల సమయం ఉంది. మరియు కొత్త రాబడికి 7-8 నెలల సమయం ఉంది. సరుకు నిల్వలు వేగంగా తగ్గుతున్నాయి. కావున ధర రూ. 15,000 వరకు చేరవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నందున దిగ్గజ వ్యాపారులు సరుకు విక్రయించడం లేదు. ప్రభుత్వ కొనుగోల్లు భారీగా తగ్గాయి. దీనితో పత్తి గింజలు, నూనెపిండి ధరలు తగ్గే అవకాశం లేదు.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు