ఈ ఏడాది ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 16 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 118.24 ల.హె. నుండి పెరిగి 127.15 ల.హె.కు విస్తరించగా ఇందులో బిటి పత్తి సేద్యం 118.56 ల.హె. ఉంది.తెలంగాణలో సెప్టెంబర్ 14 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 50,95,678 ఎకరాల నుండి తగ్గి 49,79,225 ఎకరాలు, గుజరాత్ లో సెప్టెంబర్ 12 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22,51,246 హెక్టార్ల నుండి 25,48,913 హెకార్లకు విస్తరించింది.
ప్రస్తుత సీజన్లో వృద్ధి చెందిన పత్తి సేద్యం, క్రమేపీ పెరుగుతున్న కొత్త సరుకు రాబడులతో ధరలు ఒడిదొడుకులకు గురవుతున్నాయి. అయితే, అంతర్జాతీయ విపణిలో ధరలకు మద్దతు లభిస్తున్నందున ఎగుమతులు ఇనుమడించే అవకాశం ఉన్నందున ధరల పతనానికి కొంతమేర కళ్లెం పడే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యాణా, రాజస్తాన్లో 5-6 వేల బేళ్ల పత్తి రాబడిపై రూ. 8050-8100, పత్తి గింజలు రూ. 3750-4000 ప్రతి క్వింటాలు మరియు కండీ (356 కిలోలు) రూ. 76,500-78,000, గుజరాత్ లో కొత్త స్వల్పంగా కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యాయి. ప్రతి క్వింటాలు రూ. 9000-11,000, గింజలు రూ. 3250-3900 మరియు కండీ ఎ గ్రేడ్ పత్తి రూ. 82,000- 86,000, బి గ్రేడ్ రూ. 81,000-82,000, మహారాష్ట్రలో రూ. 9000-10,500, పత్తి గింజలు రూ. 3400-3900 ప్రతి క్వింటాలు మరియు 30 మి.మీ. పొడుగుపింజ ప్రతి కండీ పత్తి రూ. 85,000- 87,000, నాగపూర్‌లో రూ. 86,000-87,000, అకోలాలో 29 మి.మీ. పత్తి రూ. 82,000-84,000, ఖాదేశ్, మరాట్వా డలో రూ. 80,000-85,000 ప్రతి కండీ ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో 29 ఎంఎం పత్తి రూ. 75,000-79,000,
ఆదోనిలో రూ.83,000-86,000 మరియు క్వింటాలు రూ. 7000-10,300, పత్తి గింజలు రూ. 2700-3700, తెలంగాణలోని వరంగల్ లో 30 మి.మీ. పొడుగు పింజ పత్తి రూ. 82,000-84,000, భైంసాలో 29 మి.మీ. పత్తి రూ. 84,000-90,000 ప్రతి కండీ మరియు రూ. 8500-10,000, పత్తి గింజలు రూ. 2800-3700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు