పత్తి

 


తెలంగాణాలో పత్తి విస్తీర్ణం పెంచాలని ప్రణాళిక


 2020-21 లో తెలంగాణాలో పత్తి విస్తీర్ణం 24 లక్షల హెక్టార్లు ఉంది. ప్రభుత్వం 28 లక్షల హెక్టార్లను అంచనా వేయడం జరిగింది. అయితే, రై తులు మిరప మరియు వరి సాగుకు మొగ్గుచూపడంతో పత్తి విస్తీర్ణం తగ్గి 18 లక్షల హెక్టార్లకు చేరింది. అక్టోబర్, 2021 ప్రారంభ సీజన్ నుండే మీడియం స్టేపుల్ పత్తి ధర రూ. 5726 ప్రతిక్వింటాలు మద్దతు ధరతో పోలిస్తే అధికంగా ఉంది మరియు గత కొన్ని వారాలుగా దేశంలోని మార్కెట్లలో రూ. 11000-12000 ప్రతి క్వింటాలు వరకు చేరింది.


 కావున, ఖరీప్లో విస్తీర్ణం గత సీజన్లో ఉన్న 18 లక్షల హెక్టార్లతో పోలిస్తే 55-56 శాతం పెరిగి 28-30 లక్షల హెక్టార్ల చేరే అంచనా కలదు. అయితే, కాటన్ సీడ్ పరిశ్రమ అంచనా ప్రకారం 15 శాతం మేర పెరుగుదలకు అవకాశం కలదు. ఖరీఫ్ సీజన్ కోసం తీసుకోవలసి చర్యల గురించి చర్చించ డంకోసం వ్యవసాయ మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో తెలంగాణా వ్యవసాయ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి ప్రక టించిన వివరాల ప్రకారం కొత్త సీజన్లో ఖరీపంటల మొత్తం విస్తీర్ణం 57 లక్షల హెక్టార్లు మరియు ఇందులో పత్తి పంట విస్తీర్ణం 28-30 లక్షల హెక్టార్లు మరియు ఉద్యానవన పంటలు 5 లక్షల హెక్టార్లు, కంది విస్తీర్ణం 6 లక్షల హెక్టార్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయడం జరుగుచున్నది. రాష్ట్ర ప్రభుత్వం 1332 పత్తి, 1000 వరి మరియు 82 కంది కస్టర్స్ ను గుర్తించడం జరిగింది మరియు ఇట్టి క్లస్టర్స్లో ప్రతి పంట కోసం ప్రత్యేక పంట పథకాన్ని రూపొందిచడం జరుగుచున్నది.


పంజాబ్లో పత్తి సాగు ప్రారంభం


 గత ఏడాది పత్తి ఉత్పత్తి తగ్గడంతో ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి మరియు అనుకూల వాతావ రణ పరిస్థితుల వలన ఈ ఏడాది రైతులు పత్తి సాగును ముందుగానే ప్రారంభించారు. పత్తి ఉత్పాదక జిల్లాలనుండి లభించిన సమాచారం ప్రకారం వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున దిగుబడి పెరిగే అంచనాతో రైతులు పంటసాగు ఉత్సాహంగా ప్రారంభించారు. 18, ఏప్రిల్ వరకు 2500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పంట విత్తడం జరిగింది.


పంజాబ్లో 2022-23 లో పత్తి విస్తీర్ణం 23 శాతం పెరిగి 4 లక్షల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ధారించడం జరిగింది. వ్యవసాయ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత సంవ త్సరం గోధుమ పంట కోతలు సమయానికి ముందే పూర్తి కావడంతో రాష్ట్రంలోని ఏడు ప్రముఖ జిల్లాలలో ఇంతవ రకు ఫజిల్కాలో గరిష్టంగా 1600 హెక్టార్లలో పంట విత్తడం పూర్తికాగా, దీని తరువాత భటిండాలో 310 హెక్టార్లు, మాన సలో 300 హెక్టార్లు ముక్తసర్లో 153 హెక్టార్లలో విత్తడం పూర్తయింది. ఆవ పంట కోతలు కూడా దాదాపు పూర్త య్యాయి మరియు రైతులు ప్రస్తుతం వత్తిసాగుపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రాబోవు 10 రోజులలో పంట విత్తడం ముమ్మరం కాగలదు. పంజాబ్, హర్యాణా మరియు రాజస్తాన్ లాంటి పత్తి ఉత్పాదక రాష్ట్రాల అంతరరాష్ట్ర పర్యవేక్షక కమిటీ వారి సలహా ప్రకారం పింక్ బాల్ వార్మ్ సంక్రమణ పథకం క్రింద రైతులకు పత్తి సాగు 15, ఏప్రిల్ నుండి 15, మే మధ్య పూర్తి చేయడం కోసం ప్రోత్సహించాలని నిర్ణ యించడం జరిగింది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిఎయూ) వర్గాల కథనం ప్రకారం ప్రస్తుతం వాతావరణం వేడిగా ఉన్నందున పత్తిసాగుకు అనుకూలంగా ఉంది. మరియు రాష్ట్రంలోని వ్యవసాయ మరియు సాగునీటి పారు దల శాఖ వారు ఏడు పత్తి ఉత్పాదక జిల్లాలలోని అనేక ప్రాంతాలలో సాగునీరు విడుదల చేయడం జరుగుచున్నది. కాలువల నీరు పొలాలకు అందడం ప్రారంభమయింది. ఫిరో జీపూర్ కర్నాల్ సర్కిల్ అధికారుల కథనం ప్రకారం ఫజిల్కా జిల్లాలో కూడా త్వరలో సాగు నీరు అందడం ప్రారంభం కాగలదు. కావున, ఉత్పత్తి మెరుగ్గా ఉండగలదని అధికా రులు అంచనా వేస్తున్నారు మరియు రైతులు గత ఏడాది. నష్టాలనుండి బయటపడే అవకాశం ఉంది. చీడపీడల బెడ దను నివారించడం కోసం చర్యలు తీసుకోవడం జరుగుచు న్నది. గత ఖరీప్ సీజన్లో పింక్ బాల్ వార్మ్ వలన పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. అయితే, మార్కెట్లో రికార్డు ధర లభించడం వలన నష్టాలు పూరించబడ్డాయి.



Comments

Popular posts from this blog