ఉత్తర భారత్ లో మొదలైన కొత్త పత్తి

   


02-10-2021


               దేశంలో 2021-22 ఖరీఫ్ సీజన్ పత్తి ఉత్పత్తి 362.20 లక్షల బేళ్లు ఉండగలదని ప్రభుత్వ వర్గాలు తమ ముందస్తు అంచనాలో పేర్కొనగా, వ్యాపారులు ఇందుకు భిన్నంగా స్పందిస్తూ, హర్యాణాలో పంట కోతల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటకు నష్టం చేకూరినందున ఉత్పత్తి ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు.


ప్రస్తుతం పంజాబ్లో పత్తి సేద్యం 3.25 ల.హె.కు విస్తరించింది. ఇందులో మే నెలకు ముందు విత్తిన పంట కోతల ప్రక్రియ ఆగస్టు నుండి ప్రారంభమైంది. అత్యధిక మంది రైతులు సెప్టెంబర్ 15 కోతలు చేపట్టారు. పంజాబ్లో ఉత్పత్తి గత ఏడాది 50 లక్షల క్వింటాళ్లను అధిగమించే అవకాశం కనిపిస్తున్నది.


సెప్టెంబర్ 21 వరకు ఉత్పాదక ప్రాంతాలలోని పలు మార్కెట్లలోని రాబడులు సుమారు 80 వేల క్వింటాళ్లకు చేరాయి. ఇందులో మానస జిల్లాలో 27 వేల క్వింటాళ్లు, భటిండాలో 12 వేల క్వింటాళ్లు, ఫజిల్కా జిల్లాలో 26 క్వింటాళ్ల సరుకు రాబడులు నమోదయ్యాయి.


ప్రస్తుతం పంజాబ్ లో ప్రతి రోజు 2-3 వేల బస్తాల పత్తి రాబడిపై డిసిహెచ్ రకం రూ. రూ. 12,500-14,000, బన్ని రూ. 8000-9000, డిసిహెచ్ సీడ్ మరియు బన్ని విత్తులు రూ. 3700-3750 ప్రతి క్వింటాలు మరియు డిసిహెచ్ ప్రతి బేలు రూ. 1.02-1.06 లక్షలు, బన్ని రూ. 55,500-55,700 ధరతో వ్యాపారమైంది. కర్ణాకలోని రాణిబెన్నూర్, హవేరి ప్రాంతాల మార్కెట్లలో 600-800 బుట్టల సరుకు రాబడిపై బన్ని రకం రూ. 8200-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఆదిలాబాద్ మార్కెట్లో పాత సరుకు రూ. 5700-7800, పత్తి గింజలు రూ. 4800, పిండి రూ. 2600 ప్రతి క్వింటాలు మరియు బేలు రూ. 54,000-55,000 మరియు వరంగల్లో 7-8 బస్తాల పత్తి రాబడిపై రూ.5675-7200, పాత సరుకు రూ. 6900-7050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు