భారత్ లో పత్తి పంట ఉత్పత్తి - ఎగుమతులు పెరిగే అంచనా
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి తగ్గడం వలన ధరలు ఇనుమడించగలవని అంతర్జాతీయ ఏజెన్సీల నుండి సంకేతాలు అందుతున్నాయి.
పాకిస్తాన్ లో వరదలు సంభవించినందున పత్తి ఉత్పత్తి 5 ల.ట. మేర తగ్గి 10 ల.ట.కు చేరవచ్చని వరదల వలన సంభవించిన నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ పత్తి సలహా సంఘం ఇటీవల విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. టెక్సాలో 10 ల.ట.కు పైగా తగ్గి అమెరికా వ్యాప్తంగా పత్తి ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే తగ్గగలదని ఐఇఎసి పేర్కొన్నది. తద్వారా ప్రతి పౌండు ధర 126.95 సెంట్లకు ఎగబాకి మున్ముందు మరింత వృద్ధి చెందగలదని కూడా పేర్కొన్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 2 నాటికి పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.17 కోట్ల హెక్టార్ల నుండి 8 శాతం వృద్ధి చెంది 1.26కోట్ల హెక్టార్లకు విస్తరించినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్ లో కురిసే విస్తృ త వర్షాలతో పాటు ప్రతికూల వాతావరణం తోడు కానట్లయితే 2022-23 - సీజన్ లో ఉత్పత్తి 3.75 కోట్ల బేళ్లకు చేరగలదు.
భారతదేశంలో ప్రస్తుతం పత్తి పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోందని భారత పత్తి సమాఖ్య (సిఎఐ) తెలిపింది. పంట చేతికొచ్చేంత వరకు వాతావరణం అన్ని విధాలుగా సహకరించినట్లయితే, 3.50-3.75 కోట్ల బేళ్ల ఉత్పత్తి సాధించవచ్చని సిఎఐ పేర్కొన్నది. ఈ ఏడాది జనవరిలో పత్తి ప్రతి కండీ (356 కిలోలు) రూ. 70,300 పలికిన ధర మే, జూన్ నాటికి పెరిగి రూ. 1 లక్షకు చేరి రికార్డు నమోదు చేసింది. అటు తర్వాత జూలైలో కొంత ఊరటనిచ్చి రూ.98,000 మరియు ఆగస్టు 3 నాటికి 91,500 అటు తర్వాత తాజాగా గత వారం రూ. 93,000 కు చేరింది. 1500 కు పైగా చిన్నతరహా నూలు మిల్లులు పూర్తి స్థాయిలో మూత పడగా మధ్య మరియు దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తిని 50-70 శాతం మేర కుదించాయి. ప్రస్తుతం ఏ ఒక్క మిల్లు కూడా తమ పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేపట్టనందున నెలవారీ వినియోగంలో తగ్గుదల నమోదైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు