అముదాలకు కొరవడిన గిరాకీ

 


మార్చి చివరి వారం కారణంగా మిల్లర్ల కొనుగోళ్లు తగ్గడం మరియు రెత్తుల అమ్మకాలు పెరగడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. దీనితో వాయిదా మార్కెట్లో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7250 తో ప్రారంభమైన తర్వాత రూ. 7236 వద్ద ముగిసింది. మే వాయిదా రూ. 7344తో ప్రారంభమె రూ. 7348 వద్ద ముగిసింది. గుజరాత్లోని పాటన్, సిద్దపూర్, కడి, పలంతూర్, సాబర్కాంట, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మెహసానా తదితర ప్రాంతాలలో దినసరి 1 లక్ష బస్తాలకు పెగ్డా ఆముదాలు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7325, మీడియం రూ. 6500-6800, యావరేజ్ రూ. 6000-6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని జడ్చర్ల, గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్ మార్కెట్లలో 500 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7080, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లో కలిసి గత వారం 1000-1500 బస్తాల ఆముదాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6900-7020, మీడియం రూ. 5500-6000, వినుకొండ, గిద్దలూరు, పొదిలి మరియు పరిసర ప్రాంతాలలో 2-3 లారీల సరుకు రాబడి కాగా, రూ. 6500-6600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని జోధ్పూర్లో నాణ్యమైన సరుకు రూ. 6850-6900, మీడియం రూ. 6400-6500, నూనె రూ. 1400 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog