నువ్వులలో కొనసాగుతున్న మందకొడి

 

కేంద్ర ప్రభుత్వం నూనెగింజలపై పరిమితి విధించడం మరియు కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 2000 బస్తాల కొత్త నువ్వుల రాబడి కాగా, నలుపు రకం సరుకు రూ. 10,400-10,500, విరుధాచలం డెలివరి (ప్రతి 75 కిలోల బస్తా ) రూ. 8000, తెల్ల నువ్వులు రూ. 11,000, విరుధ్నగర్ డెలివరి జిఎస్టి సహా రూ. 8600 మరియు చాగలమర్రి, ఆళ్ళగడ్డ ప్రాంతాలలో 2 లారీల సరుకు రాబడి కాగా, రూ. 10,000-11,000, నలుపు రకం రూ.10,000 -10,500 ప్రతి క్వింటాలు మరియు నర్సారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో వచ్చేవారం నుండి మరియు పార్వతిపురం, శ్రీకాకుళం ప్రాంతాలలో ఏప్రిల్ చివరి వారంలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు.


 తమిళనాడులోని శివగిరి ప్రాంతంలో 1000 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, తెలుపు రకం రూ.12,000-13,000, నలుపు రకం రూ. 11,700-14,000, తిరుకోవిలూరు, కల్లకుర్చి, విరుధా చలం, వూల్లుపురం, బోత్పాడి మొదలగు ఉత్పాదక ప్రాంతాలలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై దినసరి 1000-1500 బస్తాల రాబడిపై 80 కిలోల బస్తా రూ. 8400-10,550, 38 కిలోల నూనె దిగుబడి కండీషన్ సరుకు త్రిచి, ఈరోడ్, రాజపాలయం డెలివరి రూ.10,800, ఆంధ్ర, నర్సారావుపేట ప్రాంతం సరుకు రూ. 8000- 9000 ధరతో వ్యాపారమెంది. 


రాజస్తాన్ లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, శ్రీగంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 1000 బస్తాల తెల్లనువ్వుల రాబడి కాగా, తెల్లనువ్వులు కొత్త సరుకు 99.1 రూ. 10,000 10,200, 98.2 రకం సరుకు రూ. 10,000-10,100, 95.5 సరుకు రూ. 9500-9800, గజ్జర్ నువ్వులు రూ. 9200-9400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,600-10,700, ఆగ్రాలో 75 కిలోల బస్తా రూ. 8200 (జిఎస్టి సహా), మరియు నీమచ్లో గత వారం 600 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 9300-9400, మీడియం రూ. 9000-9200, యావరేజ్ సరుకు రూ. 8500-8600 ధరతో వ్యాపారమైంది. కాన్పూర్లో రూ. 10,700 -10,800, 99.1 సరుకు గుజరాత్ రకం రూ. 11,100, సార్టెక్స్ ముంద్రా డెలివరి రూ. 11,900 12,100, ముంబై డెలివరి రూ. 12,100-12,300 ధరతో వ్యాపారమెంది. గుజరాత్ లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 2-3 వేల బస్తాల రాబడిపె నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 11,000-11,400, మీడియం రూ. 10,800-11,000, యావరేజ్ రూ. 10,500-10,700 మరియు 2 వేల బస్తాల నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 11,100-13,250, మీడియం రూ. 10,350-11,600, క్రషింగ్ రకం రూ. 7000-8500 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు