పెరిగిన ఆముదాల వాయిదా ధరలు

 

ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 7268 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 144 పెరిగి రూ. 7412, మే వాయిదా రూ. 130 పెరిగి రూ. 7490 వద్ద ముగిసింది. గుజరాత్లోని పాటన్, సిద్దపూర్, కడి, వలంతూర్, సాబర్ కాంట, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మెహసానా తదితర ప్రాంతాలలో దినసరి 50 వేల బస్తాలకు పైగా ఆముదాలు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7240, మీడియం రూ. 6500-6800, యావరేజ్ రూ. 6000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


 తెలంగాణలోని జడ్చర్ల, గద్వాల, నారాయణపేట, నాగర్కర్నూల్, మహబూబ్ నగర్ మార్కెట్లలో 800 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6450-6920, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లో కలిసి గత వారం 1000-1200 బస్తాల ఆముదాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-6650, మీడియం రూ. 5500-6000, వినుకొండ, గిద్దలూరు, పొదిలి మరియు పరిసర ప్రాంతాలలో 3-4 లారీల సరుకు రాబడి కాగా, రూ. 6450-6675, నర్సారావుపేటలో బిఎస్ఎస్ నూనె (15 కిలోలు జిఎస్టి సహా) రూ. 1640, పిండి ప్రతి క్వింటాలు రూ. 1950-2000, హెదరాబాద్లో ఆముదాలు రూ. 6900-6950, నూనె బిఎస్ఎస్ ట్యాక్స్ పెయిడ్ రూ. 1610, కమర్షియల్ రూ. 1750, పిండి లూజ్ రూ. 1800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని జోధ్పూర్లో నాణ్యమైన సరుకు రూ. 6800, మీడియం రూ. 6500, నూనె రూ. 1450 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు