గత సోమవారం ఎన్సిడిఇఎక్స్ వద్ద ఆగస్టు వాయిదా రూ. 7270 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 62 క్షీణించి రూ. 7208, సెప్టెంబర్ వాయిదా రూ.80 క్షీణించి రూ. 7254 వద్ద ముగిసింది.
గుజరాత్లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ఆగస్టు 5 నాటికి ఆముదాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.48 ల.హె. నుండి రెట్టింపై 3.08 ల.హె.కు విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది. ఇందులో గుజరాత్లో ఆగస్టు 1 నాటికి గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,02,857 హెక్టార్ల నుండి పెరిగి 1,47,265 హెక్టార్లు, రాజస్తాన్లో నిర్ధారిత లక్ష్యం 1.60 ల.హె.కు గాను 1,13,440 హెక్టార్లకు విస్తరించింది. అయితే, సేద్యం ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 20-25 వేల బస్తాల ఆముదాలు రాబడి కాగా రూ. 7000-7200, మీడియం రూ. 6500-6800 మరియు రాజస్తాన్లోని వారాంతపు మార్కెట్లో 1000 బస్తాలు రూ. 6900-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని ఆదోని వారంతపు సంతలో 150-200 బస్తాల సరుకు రాబడిపై రూ. 6800-6900, నిమ్ము సరుకు రూ. 6500-6600, గిద్దలూరు, వినుకొండలో 3-4 వాహనాల కొత్త సరుకు రాబడిపై రూ.6800-6900, కర్నూలు, ఎమ్మిగనూరు మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో రాబడులు చరమాంకంలో పడ్డాయి. నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1640 టాక్స్-పెయిడ్, కమర్షియల్ రూ. 1600, పిండి 100 కిలోలు రూ. 2250, హైదరాబాద్ లో ఆముదం గింజలు రూ. 7500 ప్రతి క్వింటాలు మరియు నూనె 10 కిలోలు బిఎస్ఎస్ రూ. 1620, కమర్షియల్ రూ. 1590 మరియు పిండి 100 కిలోలు రూ. 2100 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు