కొత్త నువ్వులకు కొనసాగుతున్న మందగమనం

 


దేశంలో ప్రస్తుత యాసంగి సీజన్ కోసం నువ్వుల విస్తీర్ణం 3.85 ల.హె.లతో పోలిస్తే పెరిగి 4.14 లక్షల హెక్టార్లకు చేరింది. మరియు తెలంగా ణలోని నిజామాబాద్ మరియు ఆంధ్రలోని విజయనగరం, నర్సన్నాపేట ప్రాంతా లలో కొత్త సరుకు రాబడి ప్రారంభమై దినసరి 300-400 బస్తాలు రాబడి కాగా, ఎర్ర నువ్వులు రూ. 8600-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల నూనె మిల్లుల కోసం ప్రతి 75 కిలోల బస్తా రూ. 6800 ధరతో డెలివరి వ్యాపారం అయింది. 



మరియు వచ్చే వారం నుండి రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. వచ్చే నెల నుండి గుజరాత్లో రాబడులు ప్రారంభం కాగలవు. ఈ ఏడాది ఎగుమతి డిమాండ్ కొరవడినందున ప్రస్తుత సంవత్సరం 2021-22లో మందగమనం ఉండడంతో స్టాకిస్టులకు లాభం చేకూరడం లేదు.


చైనా ప్రముఖ నువ్వుల దిగుమతిదారుగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం డిమాండ్ పెరుగుతున్నది. ఈ ఏడాది మొదటి రెండు నెలలలో చైనా ద్వారా దిగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11,874 టన్నుల నుండి పెరిగి 28,662 టన్నులకు చేరాయి. అయితే ఈ సారి జనవరి-ఫిబ్రవరిలో పాకిస్తాన్ నుండి ఎక్కువగా సరుకు దిగుమతి అయింది. ఎందుకనగా పాకిస్తాన్లో నువ్వుల ఉత్పత్తి వార్షికంగా 1 లక్ష టన్నుల ఉండగా, ఇందులో 85 శాతం సరుకు ఎగు మతి అవుతున్నది.


ఎక్స్పోర్ట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వర్గాల కథనం ప్రకారం చైనా - పాకి స్తాన్ల మధ్య స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం అమలులోకి రావడంతో పాకిస్తాన్ నుండి చైనాకు దిగుమతులు పెరిగాయి. చరిత్రలో మొదటిసారిగా ఈ ఏడాది ఆగస్టు 2021 నుండి మార్చి 2022 మధ్య కాలంలో పాకిస్తాన్లో ఉత్పత్తి అయిన సరుకులో 90 శాతం సరుకు ఎగుమతి అయింది. ఇందులో 80 శాతం చైనాకు ఎగుమతి అయింది. దీనితో కొత్త పంట కోతలకు ముందు మొత్తం సరుకు సమాప్తమైంది. 2022-23 కోసం పాకిస్తాన్లో పంట విత్తడం ప్రారంభమైంది అయితే పంట కోతలకు మరో 4-5 నెలల సమయం ఉంది.


తమిళనాడులోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 30-35 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అవుతుండగా, ఇందులో కొడిముడిలో సోమవారం నాడు 500 బస్తాలు, మంగళవారం త్రిచంగోడ్లో 300 బస్తాలు, శనివారం నాడు 400 బస్తాలు, శుక్రవారం నాడు శివగిరిలో 2 వేల బస్తాల రాబడిపై ఎర్ర నువ్వులు ప్రతి 80 కిలోల బస్తా రూ. 8300-9000, తెల్ల నువ్వులు రూ. 9200-9300, నల్ల నువ్వులు రూ. 8800-8900, తిరుకోవిలూరు, విల్లుపురం, విరుధాచలం, కల్లకుర్చి, బోత్పాడి ప్రాంతాలలో దినసరి 2-3 వేల బస్తాల కొత్త సరుకు రాబ డిపై ప్రతి 80 కిలోల బస్తా రూ. 7600-9150 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని కడప, బద్వేలు, వెంపల్లి, దువ్వూరు ప్రాంతాలలో దినసరి 1500-2000 బస్తాల రాబడిపై నలుపు రకం రూ. 9000, తెలుపు రకం రూ. 10000-10,200 ప్రతి క్వింటాలు మరియు మే మొదటి వారం తమిళనాడు డెలివరి నల్ల నువ్వులు ప్రతి 75 కిలోల బస్తా రూ. 6800 ధరతో వ్యాపారమంది. నర్సారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో 150-200 బస్తాల రాబడిపై రూ. 8800-9000 ప్రతి క్వింటాలు మరియు 75 కిలోల బస్తా విరుధ్నగర్ డెలివరి రూ. 7000 ధరతో వ్యాపారమైంది.


చాగలమర్రి, ఆర్లగడ్డ, మైదుకూరు ప్రాంతాలలో దినసరి 4-5 వాహనాల కొత్త నువ్వుల రాబడిపై నలుపు రకం రూ. 200 తగ్గి రూ. 9000-9050, తెల్ల నువ్వుల రూ. 10,200-10,400 ప్రతి క్వింటాలు లోకల్లూజ్ ధరతో వ్యాపా రమై కాంగేయం కోసం రవాణా అవుతున్నది.


మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,000-10,200, ఆగ్రాలో హల్లింగ్ రకం రూ. 9800-9900 (జిఎస్టి సహా), కాన్పూర్లో 10,000-10,400 ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 4-5 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,150-10,400, మీడియం రూ. 9900-10,100, యావరేజ్ రూ. 9100-9500 మరియు నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 11,000-12,175, మీడియం రూ. 9750-10,500, క్రషింగ్ రకం రూ. 6800-8000 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడు నువ్వుల రైతులకు ఆకర్షణీయమైన ధరలు లభించే అవకాశం

 తమిళనాడు వ్యవసాయ శాఖ వారి వివరాల ప్రకారం నాగర్, కీ పెరుంగావూరు, తిరుమంగలం, పూనాలూరు తదితర ప్రాంతా నువ్వు పంట విస్తీర్ణం పెరిగింది మరియు లాలగుడి బ్లాక్ యాసంగి పంట విస్తీర్ణం పెరుగుతున్నది మరియు 1000 హెక్టార్లకు పైగా సాగవు తున్నది మరియు 300-400 హెక్టార్లలో ఉండే అంచనా కలదు. ఎందుకనగా, వ్యవసాయ శాఖ వారు జాతీయ ఆహార భద్రతా మిషన్ క్రింద నూనె గింజల సాగుకోసం ఎరువులతో పాటు టిఎంవి - రకం విత్తనాలు 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయడంతో రైతులు నువ్వుల పంట సాగుకు ముందుకు వస్తున్నారు. అయితే ఈ ఏడాది సాంబా ధాన్యం కోతలు దీర్ఘకాలంపాటు కొనసాగడంతో నువ్వుల సాగు ఆలస్యం అయింది. ప్రతి ఎకరం దిగుబడి 400-450 కిలోలు ఉండగలదని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుత, గత ఏడాది మాదిరిగా రూ.9200-10,700 ప్రతీ క్వింటాలు ధర లభించగలదని వీరు ఆశాభావంతో ఉన్నాయి. గత ఏడాది మొదటి సారిగా రైతులకు నేరుగా వంటనూనెల తయారీ కంపెనీలతోఅనుసంధానం చేయడంతో వేలాల మాధ్యమంగా అమ్మకాలతో పాటు రైతులకు పంటపై మెరుగైన ధరలు లభించాయి.

Comments

Popular posts from this blog