పెరిగిన నువ్వుల ధరలు

 

లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో విస్తీర్ణం తగ్గే అవ కాశం ఉన్నందున ధరలు రూ. 500-600 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. అయితే, ఇంతవరకు యాసంగి పంట రాబడులతో పాటు స్టాకిస్టుల అమ్మకాల వలన ధరలు ఎక్కువగా పెరిగే అవకాశంలేదు.


కడప, బద్వేలు, చాగలమర్రి, ఆర్లగడ్డ, మెదుకూరు, దువ్వూరు, వెంపల్లి ప్రాంతాలలో దినసరి రూ. 8700-8800 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అయింది. నరసారావుపేట, సత్తెనపల్లి ప్రాంతాలలో ఎర్ర నువ్వులు రూ.8500-8800, ఈరోడ్ డెలివరీ రూ. 7300 మరియు విజ యనగరం, నరసన్నపేట ప్రాంతాలలో ఎర్రనువ్వులు రూ. 8500-8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమయింది.


నిజామాబాద్, మెట్పల్లి, ఆదిలాబాద్ ప్రాంతాలలో గతవారం 10-12 లారీల కొత్త నువ్వుల రాబడిపై రూ. 10,500-10,700 ధరతో వ్యాపారమై గుజరాత్, మహారాష్ట్ర మరియు మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్ కోసం రవాణా అవు తున్నది. పశ్చిమబెంగాల్లోని బెల్డా, ఖడగపూర్, మిద్నాపూర్ ప్రాంతాలలో వర్షాల కారణంగా 20 శాతం సరుకు డ్యామేజ్ అయ్యే అంచనా కలదు. మరియు పె ప్రాంతాలలో ప్రతిరోజు 7-8 లారీల కొత్త సరుకు రాబడిపై అస్క్రీన్ రూ.7500-7900 లోకల్ూజ్ మరియు స్థానికంగా మెక్రోక్లీన్ తమిళనాడు డెలి వరీ రూ. 9000-9100 ధరతో వ్యాపారమయింది. గుజరాత్లోని రాజ్కోట్, జూనాఘడ్, గోండల్, జోత్పూర్, జామ్ జోధ్పూర్, హల్వడ్, జామ్నగర్ మరియు పరిసర మార్కెట్లలో కలిసి దినసరి 20-25 వేల బస్తాల యాసంగి నువ్వుల రాబ డిపె నాణ్యమైన సరుకు రూ. 11,150-11,300,మీడియం రూ. 10,850-10,900, యావరేజ్ రూ. 10,550-10,800 మరియు 15-20 వేల బస్తాల నల్ల నువ్వుల రాబడిపై ప్రీమియం రకం రూ. 12,500-13,250, జెడ్-బ్లాక్ రూ. 12,000-12,500, మీడియం రూ. 11,500-11,625, క్రషింగ్ రూ. 8200-9000 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్లోని నిమచ్లో గతవారం 5-6 వేల బస్తాల రాబడిపై నాణ్య మెన సరుకు రూ. 10,800–11,100, మీడియం రూ. 10,500-10,700, యావరేజ్ రూ. 10,000-10,400 మరియు జాగ్రాలో 2-3 వేల బస్తాల రాబడిపై రూ. 9000-11,000, గ్వాలియర్ లో హల్లింగ్ రకం రూ. 11,400–11,500, ఆగ్రాలో హల్లింగ్ నువ్వులకు మంచి గిరాకీ రావడంతో ధర పెరిగి రూ. 11,600 ( జిఎస్టి సహా), 99.1 రకం రూ. 11,500, సార్టెక్స్ రూ. 11,600, కాన్పూర్లో హల్లింగ్ రకం రూ. 11,300-11,500 ధరతో వ్యాపారమయింది. తమిళనాడులోని శివగిరి, కొడుముడి, త్రిచంగోడ్, అవిల్ పద ప్రాంతాలలో సంతరోజు 1500-2000 బస్తాలు మరియు తిరుకోవి లూరు, విల్లుపురం, విరుధచలం, కల్లకుర్చి, బోతపాడి ప్రాంతాలలో దినసరి కేవలం 2000-2500 బస్తాల రాబడిపై నలుపు ప్రతి 80 కిలోల బస్తా రూ. 6700-9700 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు