గతవారం ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో గిరాకీ తక్కువగా ఉండడంతో మార్కెట్తో పాటు వాయిదా ధరలు మందకొడిగా 'పాటు ఉన్నాయి. గత సోమవారం నాడు ఎన్సిడిఇఎక్స్ వద్ద ఆముదాల జూలె వాయిదా 7350 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.160 తగ్గి రూ. 7190, ఆగస్టు వాయిదా రూ. 144 తగ్గి రూ. 7258 వద్ద ముగిసింది.
ప్రస్తుతం గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి దాదాపు 45-50 వేల బస్తాల ఆముదాల రాబ డిపె నాణ్యమైన సరుకు రూ. 7100-7325, మీడియం రూ. 6800-7000, రాజస్థాన్లో 10–15 వేల బస్తాల రాబడిపై రూ. 6920-6950 ధరతో వ్యాపా రమెంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గిద్దలూరు, వినుకొండ తదితర మార్కెట్లలో రాబడులు తగ్గి 600-700 బస్తాలు రాగా, నాణ్యమైన సరుకు రూ. 7000-7050, మీడియం రూ.6500-6600, నరసారావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1650 ట్యాక్స్ పెయిడ్, కమర్షియల్ రూ. 1610, పిండి 2400 ధరతో వ్యాపారమయింది. తెలంగాణలోని మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, దేవరకద్ర, జడ్చర్ల తదితర మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 300-400 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-7100 ప్రతిక్వింటాలు మరియు హైదరాబాద్లో ఆముదాలు రూ. 7300 ప్రతిక్వింటాలు, బిఎస్ఎస్ నూనె 10 కిలోలు రూ. 1620, కమర్షియల్ రూ. 1590 ట్యాక్పెయిడ్, పిండి రూ. 2100 లోకలూజ్ ధరతో వ్యా పారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు