దిగజారుతున్న ఆముదాల ధరలు

 


 2021-22 లో ఆముదాల సేద్యం 2020-21 తో పోలిస్తే 8.26 ల.హె. నుండి తగ్గి 8.11 ల.హె.కు పరిమితమైందని ప్రభుత్వం పేర్కొన్న గణాంకాల ద్వారా తెలుస్తోంది. పంట దిగుబడులు వృద్ధి చెందే అంచనాతో ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 17.89 ల.ట. నుండి స్వల్పంగా పెరిగి 17.95 ల.ట.కు చేరగలదని భావిస్తున్నారు.ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 7138 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 252 క్షీణించి రూ. 6886, ఏప్రిల్ వాయిదా రూ. 200 నష్టంతో రూ.6920 వద్ద ముగిసింది.



గుజరాత్లోని ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో ప్రతి రోజు 40-45. వేల బస్తాల ఆముదాలు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-6900, మీడియం రూ. 6200-6500, యావరేజ్ రూ.5800-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని జడ్చర్ల, నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ మార్కెట్లలో నాణ్యమైన సరుకు రూ.6000-6400, 

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలోని అన్ని మార్కెట్లో కలిసి గత వారం 2 వేల బస్తాల ఆముదాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6350-6400, మీడియం రూ. 5500-5800, వినుకొండ, గిద్దలూరు, పొదిలి మరియు పరిసర ప్రాంతాలలో రూ. 6000-6300 ప్రతి క్వింటాలు మరియు నరసరావుపేటలో బిఎస్ఎస్ నూనె ప్రతి 15 కిలోలు జిఎస్టితో రూ.1635-1640, కమర్షియల్ రూ. 1600, పిండి ప్రతి క్వింటాలు రూ. 2200 మరియు హైదరాబాద్లో ఆముదాలు రూ. 6800 ప్రతి క్వింటాలు మరియు బిఎస్ఎస్ నూనె రూ. 1610, కమర్షియల్ రూ. 1560-1570, పిండి లూజ్ 100 కిలోలు రూ. 2000- 2100 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog