ఆంధ్రప్రదేశ్ లో వేరుసెనగ పంటకు నష్టం - ఉత్తప్రదేశ్, రాజస్థాన్ లలో మొదలైన కొత్త వేరుసెనగ రాబడులు - గత వారం ధరలు

 

12-10-2021

ఆంధ్రప్రదేశ్ లో వేరుసెనగ పంటకు నష్టం


ఈ ఏడాది రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు మరియు కడప జిల్లాలలో గతి తప్పిన వర్షాల వలన వేరుసెనగ సేద్యం గత ఏడాదితో పోలిస్తే 7,29,377 హెక్టార్ల నుండి 1,01,437 హెక్టార్లు తగ్గి 6,27,940 పరిమితమైంది.


             అనంత పురం జిల్లాలలో సెప్టెంబర్ -అక్టోబర్ లో వర్షాలు కొరవడినందున వేలాది ఎకరాలలోని వేరుసెనగ పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలో సాధారణంగా సెప్టెంబర్ నెల వర్షపాతం 118.4 మి.మీ.కు గాను 61.3 శాతం తగ్గి 45.8 మి.మీ.కు పరిమితమైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం88.7 మి.మీ.కు గాను 19.4 శాతం తగ్గి 71.5 మి.మీ. అయితే, రుతుపవనాల సీజన్ జూన్ 1 సెప్టెంబర్ 30 వరకు మొత్తం వర్షపాతం సాధారణంతో పోలిస్తే 344.4 మి.మీ.కు గాను 338.4 మి.మీ. 50 రోజుల దీర్ఘకాలం పాటు వర్షాలు కురవక అటు తర్వాత కురిసిన కుండపోత వర్షాలకు వర్ధమాన పంటకు తీరని నష్టం వాటిల్లింది.



ఉత్తప్రదేశ్, రాజస్థాన్ లలో మొదలైన కొత్త వేరుసెనగ


ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, మహోబా మరియు రాజస్తాన్ లోని బికనీర్, నోఖా, శ్రీగంగానగర్ ప్రాంతాలలో కొత్త వేరుసెనగ రాబడి ప్రారంభమైంది.గుజరాత్లో కూడా పంట కోతల ప్రక్రియ ఇప్పుడిప్పుడే శరవేగంతో చేపడుతున్నారు. అయితే, కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాలలో సరుకు నాణ్యత కొరవడింది. రాబోయే రబీ సీజన్ సేద్యం కోసం విత్తనాలకు ఆదరణ ఊపందుకున్నది.

కొత్త వేరుసెనగ ధరలు దీపావళి వరకు ధరలు మందగించే అవకాశం లేదని వ్యాపారులు అభిప్రాయ ఎడుతున్నారు. ఎందుకనగా, దేశంలో వంటనూనెలకు సమృద్ధిగా డిమాండ్ కొనసాగుతున్నది. అంతేకాకుండా,పాత సరుకు నిల్వలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అక్టోబర్ 20 తర్వాత ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్లో ఎండు సరుకు రాబడులు పోటెత్తే అవకాశం ఉంది. అయితే దేశంలోని అన్ని వినియోగ రాష్ట్రాలలో సరుకు మంచి ఆదరణ చూరగొంటున్నందున రాబడి అయిన సరుకు తక్షణమే విక్రయించ బడ గలదు. కామన రైతులకు అత్యంత ప్రయోజనం చేకూరగలదు.



గత వారం ధరల వివరాలు


 గుజరాత్ లోని రాజ్కోట్లో గత వారం 30-40 వేల బస్తాల వేరుసెనగ రాబడి కాగా, నాణ్యమైన సరుకు 24-నెంబరు రూ. 6125-6375, మీడియం రూ. 5250-5750, యావరేజ్ రూ. 4750-5250, 37-నెంబర్ సరుకు రూ. 5150-5500, మీడియం రూ. 4750-5000, యావరేజ్ సరుకు రూ. 4750-5000, 39-నెంబర్ నాణ్యమైన సరుకు రూ.500-800, మీడియం రూ.4750-5250, యావరేజ్ సరుకు రూ. 3900-4400 మరియు దిసా, గోండల్, పాలన్పూర్ ప్రాంతాలలో కొత్త వేరుసెనగ రూ. 4500-6000 మరియు 10 వేల బస్తాల పాత సరుకు రాబడిపై 24-నెంబర్ రోహిణి మరియు 37-టిజె రకం రూ.5500-6250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 10-15 వేల బస్తాలు, ఆదోనిలో 20 వేల బస్తాలు, ఎమ్మిగనూరులో 12-15 వేల బస్తాలు వేరుసెనగ రాబడిపై నిమ్ము 4000-5000, నాణ్యమైన సరుకు రూ. 6000-7000, 80-90 కౌంట్ రూ. 9900-10,000, చెన్నై డెలివరి రూ. 10,200, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 10,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తెలంగాణ మరియు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు విత్తనాల కోసం రవాణా అవుతున్నది. 60-70 కౌంట్ ఉత్తరప్రదేశ్, రాయలసీమ, హైదరాబాద్ డెలివరి రూ. 11,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి ప్రతి రోజు 20-25 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నిమ్ము సరుకు రూ. 3500-4000, ఎండు సరుకు రూ.5300-5800, మధ్య ప్రదేశ్లోని మహోబా, ఝాన్సీ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై నిమ్ము సరుకు రూ. 4000-4500, ఎండు సరుకు రూ.5000-6300 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, లక్ష్మీశ్వర్, హుబ్లీ, రాయిచూర్ మరియు పరిసర ప్రాంతాల ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతి రోజు 30-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000–7600, మీడియం సరుకు రూ.5500-5900, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ రూ. 10,100-10,200, 70-80 కౌంట్ రూ. 10,600-10,700, కళ్యాణి రూ. 8600-8800, 140-160 కౌంట్ రూ. 8500-8600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని జైగుండంలో ప్రతి రోజు 700-800 బస్తాలు, దిండిగల్లో 2 వేల బస్తాలు, పిజాలంపట్టిలో 1000-1500 బసాలు, తిరువన్నామలైలో 600 బస్తాలు, శివగిరిలో 500 బస్తాలు, తిరుకోవిలూరులో 400 బస్తాలు, కొడుముడిలో 300 బసాలు నాణ్యమైన సరుకు రూ. 6000-7200, మీడియం రూ.5500-6000, త్రిచన్డ్, అలంగుడిలో 1000-1500 బస్తాల సరుకు అమ్మకంపై 240 కిలోలు రూ. 18,500-23,800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు