ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో పాటు దేశంలోని ప్రముఖ కిరాణా మార్కెట్లలో స్టాకిస్టుల అమ్మకాలతో యాంకుం వేలం కేంద్రాల వద్ద కొనుగోళ్లు తగ్గ డంతో సిక్కింలోని సింగటంలో ఆగస్టు 4న నిర్వహించిన పెద్ద యాలకుల వేలా లలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 525 నుండి తగ్గి రూ.507.50 ప్రతి కిలోకు చేరగా, చిన్న గింజ సరుకు రూ. 480 నుండి తగ్గి రూ.475 ప్రతి కిలో ధరకు చేరింది.
ఇదే విధంగా అస్సాంలోని గాంగ్టక్లో పెద్ద గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ. 500, చిన్న గింజ సరుకు రూ. 475 ధరతో స్థిరంగా ఉంది. అయితే పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజు సరుకు గత వారంతో పోలిస్తే రూ. 745 నుండి తగ్గి రూ.733.75, చిన్న గింజ సరుకు రూ. 552.50 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది.
కొచ్చి- 2022-23 కోసం దక్షిణ భారత దేశంలో కొత్త యాలకుల రాబ డులు ప్రారంభమయ్యాయి. అయితే వేలం కేంద్రాలలో కొత్త, పాత సరుకు కలిసి గత వారం సుమారు 8 లక్షల 27 వేల సరుకు రాబడిపై 7 లక్షల 42 వేల కిలోల సరుకు అమ్మకం కాగా, యావరేజ్ సరుకు మంగళవారం రూ. 930.65 మరియు శనివారం నాటికి పెరిగి రూ. 1037.72, మరియు నాణ్యమైన రకాలు బుధ వారం నాడు కనిష్టంగా రూ. 1302, శనివారం రూ. 1638 ధరతో వ్యాపా మెంది. అయితే అక్టోబర్లో రాబడులు పెరిగిన తరువాత ధరలు తగ్గిన సమ యంలో సరుకు నిల్వ చేసిన వారికి రూ. 150-200 ప్రతి కిలోకు లాభం చేకూరే అవకాశం ఉంది. ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకుని తగ్గిన సమయంలో స్టాకిస్టుల కొనుగోళ్లు ప్రారంభం కాగలవు. నవంబర్, డిసెంబర్లో ఎగుమతి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు