ఈ ఏడాది ఆస్ట్రేలియాలో రైతులు శనగల స్థానంలో ఆవ పంట సాగుకు మొగ్గు చూపడంతో శనగ పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అయితే భారత్లో సరుకు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం చిన్న స్టాకిస్టులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ఎందుకనగా నీటి వనరులు అందుబాటులో నేప థ్యంలో సోయా పంట కోతల తరువాత శనగ సాగుకు ముందుకు వచ్చే అవకాశం కలదు.
డాలర్ తో రూపాయి విలువ పెరిగిన నేప థ్యంలో దిగుమతిదారులు ధర తగ్గించి ప్రతిపాదించడంతో గత వారం దిగుమతి అయిన సిరిశనగ ధర రూ. 200-250, దేశీ సరు కుకు రూ. 50-100 తగ్గింది. అయితే ఎక్కువగా ధరలు తగ్గే అవ కాశం లేదు. ఎందుకనగా మధ్య తరగతి హోటళ్లలో కందిపప్పుకు బదులుగా సరిశనగ పప్పు విని యోగం పెరుగుతోంది.
రాబోవు సీజన్ పంట సాగు కోసం మరో 3 నెలల సమయం ఉంది. ప్రభుత్వం రబీ సిరిశనగ కోసం మద్దతు ధర రూ. 200 పెంచే అవ కాశం ఉంది. పెద్ద రెతులు, స్టాకిస్టులు సరుకు విక్ర యించడం లేదు. ఎందుకనగా కొత్త సీజన్ కోసం సుమారు 7 నెలల సమయం ఉంది.
మధ్యప్రదేశ్ లోని కరేలీ,అశోక్ నగర్ మరియు దేవాస్,నీమచ్ తదితర ప్రాంతాలలో 1500 - 2000 బస్తాల రాబడిపై రూ. 5000-6300, ఇండోర్లో రూ. 6700-6800 మరియు ఉత్తరప్రదేశ్లోని మహోబాలో రూ. 6000-6200, లలిత్ పూర్లో 800-1000 బస్తాల రాబడిపై రూ. 6450-6800, చందోసి, బిలాసి, బహ్ జోయి, వజీర్ గంజ్ మార్కెట్లలో 1000–1200 బస్తాల రాబడిపై రూ. 6500 – 600 మరియు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 7025, మధ్య ప్రదేశ్ సరుకు రూ.6975, బరేళిలో లావు రకం సిరిశనగ రూ. 7125–7150, సన్నరకం సరుకు రూ. 7600-7650 వ్యాపారమయింది. ధరతోముంబాయిలో కెనడా సరుకు కంటెనర్లో రూ. 250 తగ్గి రూ. 6700, ఆస్ట్రేలియా రూ. 6750, ముంద్రాలో రూ. 6450, కోల్కత్తాలో కెనడా సరుకు రూ. 6600, ఆస్ట్రేలియా రూ. 6700-6750, ఢిల్లీలో కెనడా సరుకు రూ. 6700, మధ్యప్రదేశ్ సరుకు రూ. 6950 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు