మెంతులు స్థిరం

  

గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులతో పోలిస్తే గిరాకీ సాధారణంగా ఉండడంతో ధరలు స్థిరంగా ఉన్నాయి. నిల్వలను పరిగణిస్తే, ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. స్టాకిస్టులు కూడా 10-12 శాతం ధరలు పెరిగిన తరువాత విక్రయించే అవకాశం ఉంది. ఎందుకనగా వర్షాల దృష్ట్యా రాబోవు విస్తీర్ణం పెరగవచ్చు. గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 800-1000 బస్తాల మెంతుల రాబడి పై యావరేజ్ సరుకు రూ. 5300-5800, మీడియం రూ. 5800-5950, నాణ్యమైన సరుకు రూ.6000–6050, జామ్ నగర్ లో యావరేజ్ సరుకు రూ. 4000-4200, మీడియం సరుకు రూ.4500-4700 ప్రతి క్వింటాలు నాణ్య తానుసారం వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని జామ్లాలో గత వారం 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 4200-4500, మీడియం రూ. 5000-5500, మీడియం బెస్ట్ రూ. 6000–6200, నాణ్యమైన సరుకు రూ. 6500 -7000, లావు రకం రూ. 7500-8000, మరియు నీమచ్లో 8-10 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 4500-4700, మీడియం రూ. 5200-5500, నాణ్యమైన సరుకు రూ. 6000- 6500, బోల్డు సరుకు రూ. 7300-7500, మందసోర్ 600-700 బస్తాల రాబడిపై ధర రూ. 4500-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని కోటా, బారన్, రామ్ గంజ్ మండి, బికనీర్, నో ఖా ప్రాంతాల అన్ని మార్కెట్లో కలిసి 3-4 వేల బస్తాల రాబడిపై స్థానికంగా యావరేజ్ సరుకు రూ. 4000-4300, మీడియం రూ. 4500-4700, నాణ్య మెన సరుకు రూ. 5000 5200 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు