వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం ఆగస్టు 5 వరకు దేశంలో మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 76.34 ల.హె. నుండి తగ్గి 75.75 ల.హె.లకు చేరింది. ఆగస్టు 3 నాటికి తెలంగాణలో ఖరీఫ్ మొక్కజొన్న విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,76,160 ఎకరాల నుండి తగ్గి 4,21,205 ఎకరాలకు చేరింది. గుజరాత్లో ఆగస్టు 1 నాటికి 2,87,411హె. నుండి తగ్గి 2,81,900 హె.లకు చేరగా, రాజస్థాన్లో 7,84,320 హె. నుండి పెరిగి 9,32,780 హెక్టార్లకు చేరింది. లభించిన సమాచారం ప్రకారం పె మూడు రాష్ట్రాలలో కలిసి మొత్తం మీద విస్తీర్ణం తగ్గలేదు.
కొత్త సీజన్ ప్రారంభం కావడానికి 2 నెలల సమయం ఉంది మరియు నిల్వలు వేగంగా తగ్గుచున్నాయి. అక్టోబర్ చివరివరకు ఎండు సరుకు కొరత ఉండగలదు. ఎందుకనగా, పంట కోతల తరువాత సరుకులో నిమ్ము అధికంగా ఉంటుంది. కావున, పౌల్ట్రీ పరిశ్రమకు నవంబర్ చివరి వరకు ఎండు సరుకు అవసరం ఉండగలదు. దీనితో రాబోవు రెండునెలల వరకు ధరలు తగ్గే అవకాశంలేదు.
ఆంధ్రప్రదేశ్లోని తెనాలి ప్రాంతంలో దినసరి 20 లారీల రాబడిపై రూ.2300-2350, నాణ్యమైన సరుకు రూ.2400 ధరతో వ్యాపార హనుమాన్ గంజ్, నామక్కల్ ప్రాంతాల కోసం లోడింగ్ కండిషన్పై వ్యాపారమయింది. ఏలూరు, విజయవాడ లోడింగ్ కండీషన్ నాణ్యమైన సరుకు రూ.2400, మీడియం రూ. 2350 మరియు విజయనగరం, సాలూరు, చీపురుపల్లి ప్రాంతాల శీతల గిడ్డంగుల నుండి ప్రతి రోజు 10-15 వాహనాల సరుకు అమ్మకంపై స్థానికంగా రూ. 2350, అనకాపల్లి డెలివరి రూ. 2450, హిందుపూర్, నంద్యాల, మడకశిర ప్రాంతాలలో దినసరి కేవలం 3-4 లారీల రాబడిపై రూ.2350 ధరతో వ్యాపారమైంది.
తెలగాణలోని నాగర్ కర్నూలు, ఖమ్మం, వరంగల్, కేసముద్రం ప్రాంతాలలో ప్రతి రోజు 500-600 బస్తాల మొక్కజొన్న అమ్మకంపై రూ.2350-2400 మరియు కర్ణాటకలోని చిత్రదుర్గ్, చెల్లకేరి, దావణగెరి, బళ్లారి, రాణిబెన్నూర్ ప్రాంతాలలో ప్రతి రోజు 4-5 వేల బస్తాలు సరుకు రాబడిపై రూ. 2000-2400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఝార్ఖండ్లోని రాంచీ, లోహరాగా, హజారీబాగ్ ఉత్పాదక ప్రాంతాలలో ప్రతి రోజు 1500-2000 బస్తాల యాసంగి మొక్కజొన్న రాబడిపై స్థానికంగా రూ. 2300-2350, కటక్ డెలివరి రూ.2450-2475, బీహార్ లోని బెగుసరాయ్, ఖగాడియా, గులాబ్బాగ్, దర్భాంగా, పూర్ణియా, సీతామడి ప్రాంతాల మార్కెట్లలో 20 వేల బస్తాల రాబడిపై రూ.2300-2350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్లోని కోల్కతా కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని దిండిగల్లో ప్రతి రోజు 10-15 వాహనాల మొక్కజొన్న రాబడిపై రూ.2300-2350, ఒట్టవచ్చత్రం, అరియలూరు, పెరంబూరు ప్రాంతాలలో 15 వాహనాలు రూ.2400-2450, ఉడుముల్పేట, సమక్కల్, ఈరోడ్ డెలివరి రూ.2500-2575 మరియు మధ్యప్రదేశ్లోని నీమచ్లో 600-700 బస్తాలు పచ్చ మొక్కజొన్న రూ.2350, మీడియం రూ. 2300-2325, గజ్జర్ రకం రూ. 2275-2300 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు