కొత్త పెసర ధరలు తగ్గే అవకాశం లేదు

 


ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో  దేశంలో పంట విత్తడం దాదాపు సమాప్తమైంది. ప్రభుత్వ వర్గాల గణాంకాల ప్రకారం విస్తీర్ణం కేవలం 76 వేల హెక్టార్ల మేర పెరిగింది. వ్యాపారుల కథనం ప్రకారం విస్తీర్ణం తగ్గడంతో పాటు భారీ వర్షాల కారణంగా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలలో పంటకు నష్టం వాటి ల్లింది. కందిపప్పు ధరలు పెరగడంతో పెసర పప్పు వినియోగం పెరుగుతు న్నందున పెసల ధరలు తగ్గే అవకాశం లేదు. జనవరి నుండి ప్రారంభమయ్యే రబీ నుండి యాసంగి సీజన్ కోసం రికార్డు స్థాయిలో సాగుకు అవకాశం ఉంది. దీనితో స్టాకిస్టులు కేవలం కందులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. 


ప్రస్తుతం యాసంగి పంట సరఫరా మెరుగ్గా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ ఆగస్టు 5 వరకు పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 30-23 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 30 లక్షల 99 వేల హెక్టార్లకు చేరింది. ఆగస్టు 1వరకు గుజరాత్లో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 73, 058 హెక్టార్ల నుండి పెరిగి 95,169 హెక్టార్లకు, మిటుకులు 8678 హెక్టార్ల నుండి రికార్డు స్థాయికి 10,821 హెక్టార్లకు, 

రాజస్తాన్లో పెసర విస్తీర్ణం 15,28,850 హెక్టార్ల నుండి పెరిగి 19,92,900 హెక్టార్లకు, మిటుకులు 5,09,540 హెక్టార్ల నుండి పెరిగి 9,41,960 హెక్టార్లకు, తెలంగాణాలో ఆగస్టు 3 వరకు పెసర విస్తీర్ణం 1,27,959 ఎకరాల నుండి తగ్గి 59,012 ఎకరాలకు చేరింది. ఇందులో వికారాబాద్, తాండూరు, మహబూబ్ నగర్ తో పాటు కర్ణాటకలో కూడా పంటకు నష్టం వాటిల్లింది. పంట కోతల సమయంలో వర్షాలు కురిస్తే సరుకు నాణ్యత తగ్గగలదు. 

కర్ణాటకలోని బాగల్ కోట్ ప్రాంతపు కొత్త చమ్కీపెసలు 90-10 రకం సరుకు 16 శాతం నిమ్ము సరుకు చెన్నె డెలివరి రూ. 8300, జబల్పూర్ ప్రాంతపు గ్రెవిటీ క్లీన్ రూ. 7400-7450, నరసారావుపేట, పొన్నూరు ప్రాంతాల సన్న రకం చమ్కీ పెసలు రూ. 6750-6850, పొన్నూ రులో నాణ్యమైన చమ్కీ పెసలు రూ. 200 పెరిగి రూ. 7200, సాదా రూ. 7000 మరియు 

మధ్య ప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 15 - 16 వేల బస్తాల సరుకు వ్యాపారమవుతుంది. ఇందులో పిపరియాలో 3 వేల బస్తాల రాబడిపై రూ. 6400-6550, జబల్పూర్లో 800-1000 బస్తాల రాబ డిపె రూ. 5000-6300, హర్దాలో 1500 బస్తాల రాబడిపై రూ. 5000-6800, ఇండోర్లో రూ. 6300-6700, జుల్యాంప్లో రూ. 6100-7950 మరియు కర్నాటక ప్రాంతపు పెసరపప్పు బెంగుళూరు డెలివరీ రూ. 9000, రాజస్తాన్ ప్రాంతపు సరుకు రూ. 8500-8700 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకా రం వ్యాపారమయింది.


రాజస్థాన్ కేక్, జోధ్ పూర్, కిష నగంజ్ ప్రాంతాలలో 1500 బస్తాల సరుకు రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ.6400-6800, డ్యామేజ్ రకం రూ.4000-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు