దేశవ్యాప్తంగా తగ్గిన అపరాలు, నూనె గింజల ఖరీఫ్ సేద్యం

 



 ఈ ఏడాది జూన్ 1 - ఆగస్టు 5 మధ్యకాలంలో సాధారణంతో పోలిస్తే 6 శాతం అధిక వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ పేర్కొన్నది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సేద్యం అపరాల శ్రేణిలో కందులు, మినుములు, ఉలువలు మరియు నూనెగింజల శ్రేణిలో వేరుసెనగ తగ్గినట్లు వ్యాపారులు భావిస్తుండగా కంది సేద్యం తగ్గినప్పటికీ రబీ, యాసంగి సరుకుల సరఫరా మొత్తం సీజన్ ఉత్పత్తిని భర్తీ చేయగలదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే కందులు మాత్రం దిగుమతులపై ఆధారపడడం తప్ప ప్రత్యామ్నాయం లేదని కూడా వారు తెలిపారు. ఎందుకనగా, గడిచిన కొన్నేళ్లుగా ఉత్తర ప్రదేశ్, బీహార్లో మార్చి నెలలో కొత్త కందుల రాబడి ఉండేది. కంది పంట తొమ్మిది నెలల దీర్ఘకాలం తర్వాత దిగుబడి వస్తున్నందున రైతులు ఆవాలు, సిరిశనగ సేద్యం కోసం ఆసక్తి కనబరుస్తున్నందున కంది సేద్యం కుంచించుకుపోతున్నది.


ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 5 నాటికి దేశంలో మొత్తం పంటల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9.37 కోట్ల హెక్టార్ల నుండి తగ్గి 9,08,61,000 హెక్టార్లకు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ వారాంతపు నివేదికలో పేర్కొన్నది. ఎందుకనగా, ఇదే వ్యవధిలో జూలై 29 నాటికి వరి సేద్యం 35 ల.హె. వెనుకబడగా ఆగస్టు 5 నాటికి 40 ల.హె.ను తాకింది. కావున వరి సేద్యంపై నివేదికను తక్షణమే విడుదల చేయడం తొందరపాటుగా భావిస్తున్నది. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 5 నాటికి వరి సేద్యం 3,14,14,000 విస్తరించగా అన్ని పంటల సేద్యం 6,22,61,000 హెక్టార్లతో పోలిస్తే 1.8 శాతం పెరిగి 6,34,21,000 హెక్టార్లకు విస్తరించింది. అయితే, వరి సేద్యం 11 శాతం తరుగు నమోదైంది. 

పప్పు ధాన్యాలు : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 5 నాటికి పప్పు ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,19,43,000 హెక్టార్ల నుండి తగ్గి 1,16,45,000 హెక్టార్లకు పరిమితమైంది. ఎందుకనగా, కంది సేద్యం 44.43 ల.హె. నుండి తగ్గి 39.80 ల.హె., మినుములు 33.87 ల.హె. నుండి 31.83 ల.హె., ఉలువలు 24,000 హెక్టార్ల నుండి తగ్గి 16,000 హెక్టార్లకు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, పెసల సేద్యం 30.23 ల.హె. నుండి పెరిగి 30.99 ల.హె. మరియు ఇతర పప్పు ధాన్యాలు 10.65 ల.హె. నుండి 13,66 ల.హె.కు చేరాయి.


నూనెగింజలు : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 5 నాటికి నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,73,82,000 హెక్టార్ల నుండి పెరిగి 1,74,79,000 హెక్టార్లకు విస్తరించింది. ఇందులో వేరుసెనగ సేద్యం 44.39 ల.హె. నుండి తగ్గి 41.09 ల.హె., నువ్వులు 11.21 ల.హె. నుండి 11.09 ల.హె., రామతిలలు 23,000 హెక్టార్ల నుండి 21,000 హెక్టార్లకు పరిమితం కాగా సోయాచిక్కుడు సేద్యం 1,15,10,000 హెక్టార్ల నుండి పెరిగి 1,17,51,000 హెక్టార్లు, సన్ఫ్లవర్ 1.32 ల.హె. నుండి 1.70 ల.హె.,ఆముదాలు 1.48 ల.హె. నుండి 3.08 ల.హె.కు విస్తరించింది. 

ముతక ధాన్యాలు : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 5 నాటికి ముతక ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,54,40,000 హెక్టార్ల నుండి పెరిగి 1,60,37,000 హెక్టార్లకు విస్తరించింది. ఇందులో సజ్జ సేద్యం 56.68 ల.హె. నుండి పెరిగి 65.17 ల.హె.కు విస్తరించగా మొక్కజొన్న 76.34ల.హె. నుండి తగ్గి 75.75 ల.హె., రాగులు 4.30 ల.హె. నుండి 2.67ల.హె., జొన్న 12.65 ల.హె. నుండి 12.62 ల.హె.కు పరిమితమైంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆగస్టు 5 నాటికి చెరకు ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 54.46 ల.హె. నుండి పెరిగి 54.51 ల.హె., 

పత్తి 1,13,51,000 హెక్టార్ల నుండి 1,21,13,000 హెక్టార్లకు విస్తరించగా జనుము-మెస్తా 6.99 ల.హె. నుండి తగ్గి 6.92 ల.హె.కు పరిమితమైంది. గత ఏడాది జూలై చివరి నాటికి సాధారణ సేద్యం పరిధి 10.70 కోట్ల హెక్టార్లకు గాను 80 శాతం మేర సేద్యం ప్రక్రియ పూర్తయింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది నిర్ధారిత 10,84,97,000 హెక్టార్లకు గాను 76 శాతానికి మాత్రమే విస్తరించింది. ఎందుకనగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాలలో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున జూలై చివరి మూడు వారాలలో సాధారణ సేద్యంతో పోలిస్తే 36 శాతం అదనంగా విస్తరించింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు