గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద వ్యాపారుల అమ్మకాలు పెరగడంతో వాయిదా ధరలు తగ్గగా, కిరాణా మార్కెట్లో డిమాండ్ నెలకొనడ ంతో మార్కెట్ ధరలు రూ.200-300 ప్రతి క్వింటాలుకు పెరిగాయి. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ. 23,990 తో ప్రారంభ మెన తరువాత శుక్రవారం నాటికి రూ. 240 తగ్గి రూ. 23,750, సెప్టెంబర్ వాయిదా రూ. 180 తగ్గి రూ.24,320 వద్ద ముగిసింది. అక్టోబర్ నుండి విత్త నాల కోసం డిమాండ్ ఉండగలదు. మరియు కిరాణా మార్కెట్లో నిల్వల నుండి 70 శాతం సరుకు అమ్మకం అయిన వెంటనే కొనుగోలుదారులు ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున వాయిదా ధరలు మెరుగయ్యే అవకాశం కలదు.
గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత వారం 65-70 వేల బస్తాల జీలకర్ర రాబడిపై యావరేజ్ రూ. 16,500-17,500, మీడియం రూ. 18,500 -20,500, నాణ్యమైన సరుకు రూ. 22,500-23,500, నాణ్యమైన మిషన్స్ రూ. 25,000-25,500, రాజ్కోట్లో 7-8 వేల బస్తాల రాబడిపె యావరేజ్ రూ. 19,750-21,150, మీడియం రూ.21,250-21,875, నాణ్యమెన సరుకు రూ. 21,900-22,250, యూరప్ రకం రూ. 22,500-22,875, కిరాణా రకం రూ. 22,900-23,250 ప్రతి క్వింటాలు మరియు గోండల్లో 4-5 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 19,000-19,700, నాణ్యమైన సరుకు రూ.21,500-22,300, జామ్నగర్ లో 3 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 21,000-21,500, నాణ్యమెన సరుకు రూ. 22,000-22,600, బనాస్కాంటాలో 1000-1200 బస్తాల రాబడిపై మీడియం రూ. 18,000-19,000, నాణ్యమైన సరుకు రూ. 22,000-23,000, జామ్ జోధ్పూర్లో 500-600 బస్తాల రాబడిపై రూ. 20,000-22,500, సాంచోర్, ధోరిమన్నా ప్రాంతాల మార్కెట్లలో కలిసి 1500 బస్తాల రాబడిపై మీడియం రూ. 19,500-20,200, నాణ్యమైన పరుకు రూ. 21,500-22,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు