వాము ధరలు పెరిగే అవకాశం లేదు

 



 గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద నిల్వలు కనీస స్థాయికి చేరడంతో మీడియం రకాల ధర రూ. 300-400 క్షీణించింది. కర్నూలు ప్రాంతపు వ్యాపారులు నిల్వ సరుకును వేగంగా విక్రయిస్తున్నారు. ఎందుకనగా పంట విత్తడం ప్రారంభమైంది. మరియు రైతుల వద్ద సుమారు 10-12 వేల బస్తాలు, వ్యాపారుల వద్ద 40-50 వేల బస్తాల వాము నిల్వ ఉన్నట్లు సమా చారం. అంతేకాకుండా వికారాబాద్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో వర్షాల వలన పత్తి, మొక్కజొన్న, కంది మొదలగు పంటలకు నష్టం వాటిల్లడంతో రెత్తులు వీటిని తొలగించి వాము సాగు చేస్తున్నందున ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. 


అంతేకాకుండా గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో సుమారు 1 లక్ష బస్తాల సరుకు నిల్వలు ఉన్నట్లు సమాచారం. నవంబర్ నుండి జామ్నగర్ లో కొత్త సరుకు రాబడి అవుతోంది. దీనితో ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. మధ్యప్రదేశ్ సహా అన్ని ఉత్పాదక రాష్ట్రాల ద్వారా అమ్మకాలు పెరుగుతున్నాయి.


కర్నూలు మార్కెట్లో గత మంగళవారం, శుక్రవారం కలిసి 1000-1200 బస్తాల వాము రాబడిపై యావరేజ్ సరుకు రూ. 10,500–11,500, తెలుపు రకం రూ. 12,000-13,000, మీడియం సరుకు తెలుపు రూ. 13,500–14,000, నాణ్యమైన సరుకు రూ. 14,500-16,000 ధరతో వ్యాపారమైంది. మధ్యప్రదేశ్లోని నీమల్లో గుజరాత్ ప్రాంతం నుండి 1000-1200 బస్తాల వాము రాబడిపై మీడియం యావరేజ్ సరుకు రూ. 9500-10,000, మీడియం రూ. 10,200-10,500, మీడియం బెస్ట్ రూ. 11,500-12,000, జావ్రాలో రూ. 8000-8500, మీడియం బెస్ట్ రూ. 10,500-11,000, గుజరాత్లోని జామ్నగర్లో వారంలో 4-5 వేల బస్తాల అమ్మకంపై యావరేజ్ రూ. 8500-9500, మీడియం రూ. 10,500-11,750, నాణ్యమైన సరుకు రూ. 12,500-12,750 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు