అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన మినుముల ధరలు
వ్యవసాయ మంత్రిత్వశాఖవారి నివేదిక ప్రకారం ప్రస్తుత ఖరీఫ్లో దేశంలో ఆగస్టు 5 వరకు మినుము విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 33 లక్షల 85 వేల హెక్టార్ల నుండి తగ్గి 31 లక్షల 83 వేల హెక్టార్లకు చేరింది.
గతవారం అంతర్జాతీయ మార్కెట్లో ఎస్యూ మే నెల నుండి ఇంతవరకు 100 డాలర్లు పెరిగి 1120 డాలర్లు మరియు ఎఫ్ఎక్యూ 970 డాలర్లు ప్రతిబన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించబడింది. ఇందుకు ముఖ్య కారణమేమనగా, భారత దేశంలో అతి వర్షాల వలన కొన్ని ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లింది. దీనితో ఉత్పత్తి తగ్గవచ్చని అంచనా వేయడం జరిగింది.
ముంబాయిలో ఎఫ్ఎఎక్యూ రూ. 7525-7550, చెన్నెలో ఎఫ్ఎక్యూ రూ. 7450, ఎస్ క్యూ రూ.8550 ధరతో వ్యాపారం కాగా, మున్ముందుకు రూ.8700 వరకు చేరే అవకాశం ఉంది. గుజరాత్లో విస్తీర్ణం గత ఏడా దితో పోలిసేత 1,40,549 హెక్టార్ల నుండి తగ్గి 74,579 హెక్టార్లకు, రాజు స్థాన్లో 3,50,930 హెక్టార్లనుండి తగ్గి 3,12,890 హెక్టార్లకు, తెలంగాణలో 39,886 ఎకరాల నుండి తగ్గి 27,998. ఎకరాలకు చేరడంతో పాటు వర్షాల వలన కొన్ని ప్రాంతాలలో పంటకు నష్టం చేకూరింది. సరుకు కొరత వలన ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. ఎందుక నగా కొత్త సీజన్ కోసం మరో 2 నెలల సమయం ఉంది. దీనితో తమిళనాడు. లోని తంజావూరు ప్రాంతపు టి-5 మినుములు చెన్నై డెలివరి రూ. 8800, మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ ప్రాంతపు సరుకు రూ. 8800, మహా రాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతపు కొత్త సరు కు 16 శాతం నిమ్ము మరియు 5 శాతం డ్యామేజ్ సరుకు రూ. 8500, ఆంధ్ర సరుకు త్రిచి, దిండిగల్ ప్రాంతాల కోసం పాలిష్ రకం రూ. 9000, సాదా రూ. 8800 ధరతో వ్యాపార మెంది. మార్కెట్లో యాసంగి మినుముల సర ఫరా కొనసాగుతోంది. సెప్టెంబర్ వర్షాలు కురిస్తే, ఖరీఫ్ ఉత్పత్తి మరో 10-12 శాతం తగ్గ గలదు. మధ్య ప్రదేశ్లోని జబల్పూర్లో దినసరి 2500–3000 బస్తాల రాబ డిపె రూ. 5000-7400, నిమచ్, అశోక్నగర్, బసోదా తదితర మార్కె ట్లలో 3-4 వేల బస్తాల రాబడిపై రూ. 4500-6500, ఇండోర్ లో రూ. 7000-7200, మహారాష్ట్రలోని అకో లాలో రూ. 6300, అహ్మద్ నగర్ లో రూ. 5500-7500 ధరతో వ్యాపారమయింది.
క్రిష్ణా జిల్లా మార్కెట్లలో పాలిష్ మినుములు రూ. 8700, సాదా రూ.8300, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలలో పాలిష్ 8400-8500, రూ. రూ. 8200-8300, విజయవాడలో గుండు పాలిష్ రూ.13,700, పప్పు రూ. 11,500, మీడియం పప్పు రూ. 9500-10,500, బెంగుళూర కోసం మహారాష్ట్ర ప్రాంతపు నాణ్యమైన పప్పు రూ. 11,500-12,000, మీడియం రూ. 9500-10,000 ధరతో వ్యాపారమయింది.
.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు