తగ్గిన మినుముల సేద్యం

 

వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం ఆగస్టు 12 నాటికి దేశంలో మినుముల సేద్యం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 35.82 ల.హె. నుండి తగ్గి 34.19 ల.హె.కు పరిమిత మైందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. పండుగల సీజను దృష్టిలో పెట్టుకొని పప్పు ధాన్యాలు మరియు పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు కఠిన చర్యలు చేపట్టినందున వ్యాపారులు తమ సరుకు విక్రయించేందుకు సన్నద్ధమయ్యారు. 


తద్వారా పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ముంబైలో ఎఫ్ఎక్యూ ధర రూ. 250 తగ్గి రూ. 7200, చెన్నైలో 7150-7175, ఎస్క్యూ రూ. 8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మరియు పరిసర ప్రాంతాల మినుములు చెన్నై డెలివరి రూ.8200-8400, మహారాష్ట్రలోని సాంగ్లీలో కొత్త (19 శాతం నిమ్ము)సరుకు మరియు 3-4 శాతం డ్యామేజ్ సరుకు రూ. 8300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 జబల్ పూర్ లో ప్రతి రోజు1000-1500 బస్తాల సరుకు రాబడిపై 5000-7350, నీమచ్, అశోక్ నగర్, బసోదా మరియు ఇతర మార్కెట్లలో రూ.3500-6500, ఇండోర్ లో  6900-7000, మహారాష్ట్రలోని అకోలాలో రూ. 6300, అహ్మద్ నగర్లో రూ. 4500-7500, జల్గాంవ్ లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 7500, 

ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా మినుములు స్థానిక మార్కెట్ లలో పాలిష్ సరుకు రూ.8400, అన్-పాలిష్ రూ. 8000, నంద్యాల, ప్రొద్దుటూరు, కడపలో పాలిష్ సరుకు రూ. 8175-8200, అన్-పాలిష్ రూ. 7900-8000,

 విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు రూ. 13,700, పప్పు రూ. 11,000, మీడియం రూ. 9300-10, 300, బెంగుళూరు కోసం మహారాష్ట్ర పప్పు నాణ్యమైన సరుకు 11,500-12,000, మీడియం రూ.9500-10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు