ఎగుమతి డిమాండ్తో జీలకర్ర ధరలకు లభిస్తున్న మద్దతు

 



 దేశంలో 2021-22 సీజన్ మసాలా దినుసుల ఉత్పత్తి ముందు సీజన్ తో పోలిస్తే 1.10 కోట్ల టన్నుల నుండి 1.5 స్వల్పంగా క్షీణించి 1.09 కోట్ల టన్నులకు పరిమితమైందని మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఇందులో జీలకర్ర ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన రాజస్తాన్లో ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 8.8 శాతం తగ్గి 7,25,651 టన్నులకు పరిమితం కాగా ఎగుమతులు 27.28 శాతం తగ్గి 2,16,996 టన్నులకు పరిమితమైంది.


 ఉత్పత్తి తగ్గినట్లు ఉప్పందడంతో పాటు గడిచిన కొంత కాలంగా ఎగుమతుల కోసం నెలకొన్న డిమాండ్ మరియు ధరలను ఎగదోసే వ్యాపారుల అప్రమత్తతతో ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ. 24,250 తో ప్రారంభమైన తర్వాత బుధవారం నాటికి రూ. 195 వృద్ధి చెంది రూ. 24,445, సెప్టెంబర్ వాయిదా మంగళవారం రూ. 24,800 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 180 పెరిగి రూ. 24,980 వద్ద ముగియగా అక్టోబర్ వాయిదా రూ. 25,395 తో మొదలైంది. గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత మంగళ, బుధవారాలలో కలిసి 8-10 వేల బస్తాల జీలకర్ర రాబడిపై యావరేజ్ సరుకు రూ. 18,000–19,000, మీడియం రూ. 21,000-21,500, నాణ్యమైన సరుకు రూ. 23,000-23,500, మిషన్-క్లీన్ రూ. 25,000-26,500, జామ్నగర్లో 500-600 బస్తాలు మీడియం సరుకు రూ. 21,000-21,500, నాణ్యమైన సరుకు రూ. 22,000-22,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog