గత వారం పరోక్ష విపణిలో జీలకర్ర వాయిదా ధర రూ. 500-600 వృద్ధి చెందగా ప్రత్యక్ష విపణిలో పండుగల సెలవు కారణంగా గిరాకీ కొరవడినందున ధరలు నిలకడగా మారాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఆగస్టు వాయిదా రూ. 23,705 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 565 వృద్ధి చెంది రూ. 24,270, సెప్టెంబర్ వాయిదా రూ. 660 పెరిగి రూ. 24,990 వద్ద ముగిసింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు