పెరుగుతున్న జీలకర్ర వాయిదా ధరలు
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఏప్రిల్ వాయిదా సెటిల్మెంట్ తరువాత మే వాయిదా ధరలు తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. ఎన్సిడిఇఎక్స్ గత సోమవారం మే వాయిదా రూ. 40950 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 2945 పెరిగి రూ. 43895, జూన్ వాయిదా రూ. 2980 పెరిగి రూ. 44270 తో ముగిసింది. దీనితో మార్కెట్ ధరలు తిరిగి రూ. 1000-1500 పెరగడంతో కిరాణా వ్యాపారుల కొనుగోళ్లు పెరుగుతున్నాయి.
గతవారం గుజారాత్లోని ఊంజాలో 60-70 వేల బస్తాలు, రాజ్కోట్లో 4–5 వేల బస్తాలు, గోండల్లో 5-6 వేల బస్తాలు, బనాస్ కాంటాలో వారంలో 18-20 వేల బస్తాలు, జామ్నగర్లో 10-12 వేల బస్తాల రాబడిపె యావరేజ్ రూ. 21000-22500, మీడియం రూ. 28000-37000, నాణ్యమెన సరుకు రూ. 38500-40000, మిషిన్క్లీన్ రూ.41000-42500 ధరతో వ్యాపారమయింది. రాజస్తాన్లోని మెడతాలో గతవారం 20-25 వేల బస్తాలు, ఫలౌదీలో 15 వేల బస్తాలు, సాంచోర్లో 4-5 వేల బస్తాలు మరియు నాగోర్ వారంలో 15–16 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 28000-30000, మీడియం రూ. 33000-36000, మీడియం రూ.33000-36000, నాణ్యమైన క్లీన్ రూ. 40000-42000 ధరతో వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు