ఈ ఏడాది దేశంలోని రెండు ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో జీలకర్ర ఉత్పత్తి తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. కొత్త సీజన్ కోసం మరో 7 నెలల సమయం ఉంది. దీనితో ఎక్కువగా తగ్గే అవ,కాశం లేదు. అయితే ప్రస్తుత ధరల కారణంగా రాబోవు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున వాయిదా మార్కెట్లో కొనుగోలుదారులతో పాటు డెలివరి తీసుకునే వారు తగ్గడంతో ధరలు క్షీణిస్తున్నాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం సెప్టెంబర్ వాయిదా రూ. 25,640 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి రూ. 410 క్షీణించి రూ. 25,230, అక్టోబర్ వాయిదా రూ. 190 తగ్గి రూ. 25,755 వద్ద ముగిసింది.
దేశంలోని కిరాణా మార్కెట్లో బడా వ్యాపారులు సీజలో తక్కువ ధరతో కొనుగోలు చేసి నిల్వ చేసిన సరుకును విక్రయిస్తున్నారు. దీనితో గుజరాత్ లోని ఊంఝా మార్కెట్లో గతవారం 55-60 వేల బస్తాల జీలకర్ర రాబడిపై యావరేజ్ సరుకు రూ. 18,500-19,300, మీడియం రూ. 20,000-21,000, నాణ్య మైన సరుకు రూ. 22,000 -23,000, రాజ్కోట్లో 2500 -3000 బస్తాల రాబడి పై యావరేజ్ రూ.20,000-21,500, మీడియం రూ. 21,500-22,250, నాణ్యమైన సరుకు రూ. 22, 250-22,750,యురోపియన్ రకం రూ. 22,750 - 23,125, కిరాణా రకం రూ. 23,150-23,375 జామ్ నగర్ లో 2000 బస్తాలు మీడియం సరుకు రూ. 20,500-21,000, నాణ్యమైన సరుకు రూ. 22,000-22,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు