ఎడితెరిపి లేకుండా దూసుకుపోతున్న జీలకర్ర వాయిదా

  

గుజరాత్, రాజస్తాన్ మార్కెట్లలో రాబడి అయిన సరుకు తక్షణమే విక్రయించబడుతున్నది. చౌక ధరతో సరుకు విక్రయించేందుకు రైతులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కిరాణా వ్యాపారులు అమ్మకాలతో పాటు కొనుగోళ్ల కారణంగా ధరలకు మద్దతు లభిస్తున్నది. ఈ ఏడాది మిషన్-క్లీన్ సరుకు ప్రతి క్వింటాలు రూ.55,000 అధిగమించే అవకాశం కనిపిస్తున్నది. తద్వారా గత వారం ప్రత్యక్ష విపణిలో ధర ప్రతి క్వింటాలుకు రూ. 800-1000, పరోక్ష విపణిలో రూ.1500-1700 వృద్ధి చెందింది. ఎన్సీడిఇఎక్స్ వద్ద గత మంగళవారం మే వాయిదా రూ. 45,480 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 1620 వృద్ధి చెంది రూ. 47,100, జూన్ వాయిదా రూ. 1720 ఇనుడించి రూ. 47,750 వద్ద స్థిరపడింది.


 గతవారం గుజారాత్లోని ఊంజాలో 48-50 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 21,500-23,000, మీడియం రూ. 30,000–38,000, నాణ్యమైన సరుకు రూ. 41,000-42,500, ఎక్స్ట్రా క్లీన్ సరుకు రూ. 44,500-45,000, రాజ్కోట్లో 8-9 వేల బస్తాలు యావ రేజ్ రూ. 40,000-42,250, మీడియం రూ. 42,000-42750, నాణ్య మెన సరుకు రూ. 42750- 43,250, యూరోప్ రకం రూ. 42,250-42,625, కిరాణా క్వాలిటీ రూ. 42,650-43,000 మరియు గోండల్లో 4-5 వేల బస్తాలు, బనాస్ కాంటాలో వారంలో 10-12 వేల బస్తాలు, జామ్నగర్లో 6-7 వేల బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 21,000-23,000, మీడియం రూ. 28,000-32,000, నాణ్యమైన సరుకు రూ. 38,000-42,000 ధరతో వ్యాపారమయింది. 

రాజస్తాన్లోని మెడతాలో గతవారం 14-15 వేల బస్తాల రాబడిపై రూ. 38,000-40,500, నాణ్య మెన సరుకు రూ. 42,000–43,000, మిషన్ క్లీన్ సరుకు రూ. 45,000-46000 మరియు నాగోర్లో వారంలో 15-20 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 35,000-36,000, నాణ్యమైన క్లీన్ రూ. 42,000-44,000, ఫలోదిలో 10-12 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 38,000-39,000, నాణ్యమైన సరుకు రూ. 11,000-42,000 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog