బెల్లం పొడికి పేటెంట్



జాతీయ స్థాయిలో బెల్లంపై పరిశోధనలు నిర్వహిస్తున్న విశాఖ జిల్లా అనకాపల్లి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషి ఫలించింది. గత రెండు దశాబ్ధలుగా ఇక్కడ బెల్లం పొడిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పరిశోధనలు విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇటీవల పేటెంట్ హక్కును ఇచ్చింది. 




ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయంకు ఇంత వరకూ మూడింటిపై పేటేంట్ హక్కులు లభించగా వాటిలో రెండు అనకాపల్లి పరిశోధన స్థానానివే కావడం విశేషం. పుష్కర కాలం క్రితం ఉప్పుడు బియ్యం యంత్రానికి లభించింది. ఇప్పుడు బెల్లం The Gulap పొడరుకు వచ్చింది. ఈ రెండింటిపైన అనకాపల్లి కేంద్రంలోని శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఉప్పుడు బియ్యం, బెల్లం పౌడరు పరిశోధనలలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టరు పొలమరశెట్టి వెంకట కాశీ జగన్నాథరావు (ఫోన్: 9441944640) 'అన్నదాత' తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.....



విదేశాలకు ఎగుమతి చేయవచ్చు



తెలుగు రాష్ట్రాల్లోని రైతులు దిమ్మలు, ముక్కలు రూపంలోనే బెల్లం తయారీ చేస్తారు. దీనిలో 8 నుంచి 10 శాతం తేమ ఉంటుంది. దీనివల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకే విదేశాల్లో బెల్లానికి మంచి డిమాండ్ ఉన్నా ఎగుమతులు చేయలేకపోతున్నాం. ప్రపంచంలోని 25 దేశాలలో బెల్లం తయారీ చేస్తారు. ఉత్పత్తిలో 55 శాతంతో మనదేశమే తొలిస్థానంలో ఉంది. అరబ్శాలతో పాటు నెదర్లాండ్, జర్మనీ, జపాన్, కోరియా దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది. నెలకు 600 టన్నులు డిమోండ్ ఉన్నా 100 టన్నులకు మించి ఎగుమతి చేయలేకపోతున్నాం. నౌకులద్వారా ఎగుమతి చేస్తే ఖర్చు తక్కువగా ఉంటుంది. బెల్లం దిమ్మలు, ముక్కలు రూపంలో చేస్తే ముద్దగా తయారవుతుంది. పౌడరు రూపంలో తేమ శాతం రెండు ఉంటుంది. అందువలన ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిల్వ ఉంటుంది. ఎగుమతులకు అనుకూలంగా ఉంటుంది. వినియోగం సులభమే. బెల్లం పౌడరు తయారీలో విశ్రాంత ఉపకులపతి డాక్టరు అల్లూరి పద్మరాజు, విశ్రాంతి ఏడీఆర్ డాక్టరు శాసనాల రామకృష్ణరావు చేసిన కృషి మరువలేనిది.




ఇవీ ఉపయోగాలు


క్వింటా బెల్లం తయారీలో సల్ఫారైడైయాక్సైడ్ ఏడు గ్రాములు ఉపయోగించాలి. రంగు నిమిత్తం రైతులు 40 నుంచి 80 గ్రాముల వరకూ ఉపయోగిస్తున్నారు. బెల్లం ముక్కలు, దిమ్మలు రంగు ఉంటేనే ధర ఎక్కువగా లభిస్తుంది. అందుకే ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను రైతులు ఉపయోగిస్తున్నారు. పౌడరులో ఎటువంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దిమ్మలు కంటే పౌడరుకు ఎక్కువ ధర లభిస్తుంది.


ఔషధ గుణాలు అధికం



పంచదారలో కేవలం సుక్రోసు మాత్రమే ఉంటుంది. బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే వైద్యులు బెల్లం వినియోగించమని సలహా ఇస్తున్నారు. సుక్రోసు 80 నుంచి 85 శాతం, గ్లూకోజ్, ఫ్రక్టోసు 10 నుంచి 15 శాతం, మాంసకృత్తులు 0.25, కొవ్వు పదార్థాలు 0.05, కాల్షియం 0.4, మేగ్నీషియం 0.08, క్లోరైడ్లు 0.34, సల్ఫేట్లు 0.5, పాస్ఫేట్ 0.045 శాతం ఉంటాయి. ఇనుము, రాగి, విటమిన్-ఎ, బి కూడా ఉంటాయి.






Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు