డిసెంబర్ చివరి నాటికి పంచదార ఉత్పత్తి

 

09-01-2022

అంతర్జాతీయ విపణిలో పంచదార ధరలు పతనమైనందున గడిచిన ఒక నెల రోజుల నుండి ఎగుమతి వ్యాపారం కుంటుపడింది. అయితే, ప్రస్తుత సీజన్ ప్రారంభానికి ముందే 3840ల.ట. పంచదార ఎగుమతి వ్యాపారం కుదిరింది. ప్రస్తుత సీజన్ ముగియడానికి 9 నెలల సమయం ఉన్నందున ఎగుమతి వ్యాపారులు తొందరపాటు చర్యలు చేపట్టడంలేదని భారత పంచదార మిల్లర్ల సమాఖ్య (ఐఎస్ఎంఎ) పేర్కొన్నది.


ప్రస్తుత పంచదార సీజన్ లోని మొదటి మూడు నెలలు అనగా 2021 అక్టోబర్ - డిసెంబర్ మధ్యకాలంలో దేశంలో సుమారు 492 మిల్లులు చెరకు క్రషింగ్ ప్రక్రియ ప్రారంభించగా గత ఏడాది ఇదే వ్యవధిలో 481 మిల్లులు క్రషింగ్ ప్రక్రియ చేపట్టాయి. ఈ ఏడాది మిల్లుల సంఖ్య (11) పెరిగినందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 110.74 నుండి 4.81 ల.ట. వృద్ధి చెంది 115.55 ల.ట. సరుకు దిగుబడి వచ్చింది. మహారాష్ట్రలో డిసెంబర్ చివరి నాటికి పంచదార ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 15 శాతం ఇనుమడించి 45.77 ల.ట. కు చేరగా, ఉత్తరప్రదేశ్లో 33.66 ల.ట. నుండి తగ్గి 30.90 పరిమితమైంది. ఈ ఏడాది ఎగుమతుల ఒరవడి కొనసాగినట్లయితే ధరలు ఇనుమడించగలవని లేనిచో వచ్చే సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కాగలదని వ్యాపారులు భావిస్తున్నారు. 

అయితే, బెల్లం ఉత్పత్తి తగ్గినందున పంచదార భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండగలదని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2022-23 సీజన్లో కూడా ఉత్పత్తి భారీగా ఉండగలదని తెలుస్తోంది. ఎందుకనగా సంతృప్తికరమైన వర్షాలు మరియు సానుకూల వాతావరణంతో చెరకు దిగుబడులు రాణించగలవని దీని వలన రైతుల ఆదాయం వృద్ధి చెందగలదని మరియు మిల్లులు సకాలంలో చెరకు బకాయిలు చెలించేందుకు వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుత సీజన్ అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో కర్ణాటక పంచదార ఉత్పత్తి గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 24.16 ల.ట. నుండి పెరిగి 25.65 ల.ట., గుజరాత్లో 4.5 శాతం వృద్ధి చెంది 3.50 ల.ట., ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 17 శాతం ఇనుమడించి 1.05 ల.ట., తమిళనాడులో 92 ల.ట.కు చేరింది.ప్రస్తుత సీజన్లోని మొదటి రెండు నెలల కోసం దేశంలో పంచదార అమ్మకం నిర్ధారిత కోటా 46.50 ల.ట. నుండి పెరిగి 47.50 ల.ట.కు చేరింది.

మహారాష్ట్ర పంచదార ఉత్పత్తి : 

మహారాష్ట్రలో సీజన్ ప్రారంభానికి ముందే ఉత్పత్తి భారీగా ఉండగలదని పంచదార కమిషనర్ జోస్యం పలికారు. ఎందుకనగా, రాష్ట్రంలో చెరకు సేద్యం గత ఏడాదితో పోలిస్తే 11.42 ల.హె. నుండి పెరిగి 12.50 ల.హె. కు విస్తరించడమే ఇందుకు నిదర్శనం. చెరకు ఉత్పత్తి భారీగా పెరిగినందున కొన్ని మిల్లులు మొత్తం సరుకు కొనుగోలు చేసే అవకాశం ఉండకపావచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2021-22 సీజన్ కోసం అక్టోబర్ 15 నుండి రాష్ట్రంలోని 95 సహకార మిల్లులు, 94 ప్రైవేటు మిల్లులు కలిసి మొత్తం 189 మిల్లులు క్రషింగ్ చేపట్టి 106.30 ల.ట. వార్షిక ఉత్పత్తిలో ఇప్పటికే 44 శాతం మేర అనగా 46.52 ల.ట. సరుకు దిగుబడి నమోదు చేశాయి. ఇందులో కల్హాపూర్ జిల్లాలోని 35 మిల్లులు 11.01 శాతం రికవరీతో 12.76 ల.ట. పంచదార దిగుబడి సాధించాయి.


చెరకు క్రషింగ్ చేపట్టిన రెండు నెలలలో 189 మిల్లులు 479.85 ల.ట. చెరకు క్రషింగ్ చేపట్టగా, సగటున 9.69 శాతం రికరవరీ సాధ్యమైంది. తద్వారా కొల్హాపూర్ జిల్లాలోని 35 పంచదార మిల్లులు 115.94 ల.ట. చెరకు క్రషింగ్ చేపట్టాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే అధికమని చెప్పబడుచున్నది. అంతేకాకుండా కొల్హాపూర్ నుండి కర్ణాటక కోసం భారీగా చెరకు రవాణా అయ్యే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు