పసుపు గిరాకీ

 

09-01-2022

వ్యాపారస్తుల కథనం ప్రకారం కొత్త సీజన్ ప్రారంభం కావడానికి ముందు వాయిదా ధరలు నిరవధికంగా పెరగిన నేపథ్యంలో మార్కెట్ ధరలు పెరగడంతో సరుకు నిల్వచేసిన రైతులు మరియు నాలుగు సంవత్సరాలుగా సరుకు నిల్వచేసి నిరాశకు గురైన స్టాకిస్టుల అమ్మకాలతో గత వారం ఈరోడ్ ప్రాంతంలో 75-80 వేల బస్తాలు, ఆంధ్ర, తెలంగాణాలలో 20-22 వేల బస్తాలు మరియు మహారాష్ట్రలో 40 వేల బస్తాలకుపైగా మరియు జింతూరు, శేన్ గాంవ్, వాషిం, కేసముద్రం మొదలగు చిన్న కేంద్రాలలో కూడా కలిసి దాదాపు 1.50 లక్షల బస్తాల అమ్మకంపై ధరలు రూ. 300-500 వరకు పెరిగాయి. ఇందుకు కారణమేమనగా, దేశంలోని మరఆడించే యూనిట్లు అవసరానికి అనుగుణంగానే కొనుగోలు చేశాయి. ప్రస్తుత ధర లను పరిగణనలోకి తీసుకుంటే సీజన్లో రైతులు కూడా ఉత్పత్తి అయిన మొత్తం సరుకు విక్రయించే అవకాశం కలదు. కావున, రాబడలు భారీగా పెరిగిన సమయంలో ఒకసారి ధరలు మందకొడిగా మారే అవకాశముంది. ఎందుకనగా, జనవరి చివ రివారం నుండి ఈరోడ్లో మరియు ఫిబ్రవరి మొదటి వారం నుండి తెలంగాణలో మరియు మార్చిలో మహారాష్ట్రలో రాబడులు పెరగగలవు మరియు వాయిదా ధరలలో ఒకసారి మందకొడి సర్కిట్కు అవకాశముంది.


గతవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,మహారాష్ట్ర, తమిళనాడు మొదలగు పసుపు ఉత్పాదక రాష్ట్రాలలో రాబడులు పెరగడంతో మరియు వాయిదా మార్కెట్లో స్పెక్యులేటర్లు అధిక ధరలతో విక్రయించండతో వాయిదా ధరలు రూ. 300-600 మరియు మార్కెట్ ధరలు రూ. 300-400 పెరిగాయి.


గతవారం ఎన్సిడిఇఎక్స్ సోమవారం పసుపు ఏప్రిల్ వాయిదా రూ. 9970 తో ప్రారంభమైన తరువాత శుక్ర వారం వరకు రూ. 392 పెరిగి రూ. 10362, మే వాయిదా మంగళవారం రూ.9950 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 660 పెరిగి రూ. 10610 తో ముగిసింది.


లభించిన సమాచారం ప్రకారం తమిళనాడులోని ఈరోడ్ తదితర ఉత్పాదక ప్రాంతా లలో జనవరి, 15 తరువాత కొత్త పసుపు రాబడులు ప్రారంభం కాగలవు మరియు ఈరోడ్లో గతవారం రాబడులు పెరిగి 60-65 • వేల బస్తాలు మరియు రాసీపురంలో 3 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ము రూ. 9000-9100, మీడియం రూ. 6000-6500, నాణ్యమైన గట్టా రూ. - 8000-8500, పుచ్చురకం కొమ్ము మరియు గట్టా రూ. 4500-5500, పెరుందరైలో 9-10 వేల బస్తాల రాబడిపై కొమ్ము రూ. 6300-9199, గట్టా రూ. 6009–8429 ధరతో వ్యాపారమయింది.


నిజామాబాద్లో గతవారం 600 బస్తాల కొత్త సరుకు రాబడిపై ప్రతిభా రకం కొమ్ము మరియు గట్టా రూ.6000-7200 మరియు 8-9 వేల - బస్తాల పాత సరుకు రాబడిపై రూ. 300-400 పెరిగి అన్పాలిష్ కొమ్ము రూ. 8300-8800, గట్టా రూ. 7600-8000, పాలిష్ కొమ్ము రూ. 9400-9500, రూ. 8700-8800 మరియు 

వరంగల్ నిల్వ అయిన పాత కొమ్ము మరియు గట్టా లు రూ. 7000-7400 ధరతో వ్యాపారమ యింది. 

దుగ్గిరాలలో 3000-3500 బస్తాల రాబడిపై కొమ్ము మరియు గట్టా రూ. 7200-7350, పుచ్చు రకం రూ. 5800-6000 ధరతో వ్యాపారము యింది. 

మహారాష్ట్రలోని హింగోలీలో సోమ మరియు బుధ వారాలలో కలిసి 2000–2500 బస్తాల రాబడిపై కొమ్ము రూ.8200-9400, గట్టా రూ. 7400-8200,

 నాందేడ్లో గతవారం 8-10 వేల బస్తాల అమ్మకంపై నాణ్యమైన కొమ్ము రూ. 9800-10000, మీడియం రూ. 8500–8700, గట్టా రూ. 8000-9000 మరియు

బస్మతనగర్లో 15 వేల బస్తాల అమ్మకంపై నాణ్యమైన కొమ్ము రూ. 10000-10500, మీడియం రూ. 8000-8500, రూ. లు 7500-9000, మరియు 

సాంగ్లీలో 8-10 వేల బస్తాల అమ్మకంపై నాణ్య మన రాజాపురి రూ. 10500 11000, మీడియం రూ.8800 9000, 

దేశీ కడప రూ. 7500 8500 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు