కొత్త శనగ రాబడులతో తగ్గిన ధరలు

 

24-01-2022

 ఏడాది దేశంలో ఉత్పత్తి పెరగడంతో మరియు మిగులు నిల్వలతో పాటు కొత్త సీజన్ ప్రారంబం కావడంతో ఫిబ్రవరిలో మహారాష్ట్ర, గుజరాత్ లలో రాబడులు పెరిగిన తరువాత ధరలు తగ్గి రూ. 4200-4500 వరకు చేరవచ్చని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనగా కొత్త సీజన్లో సరుకు నిమ్ముతో ఉండడం వలన ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ధరతో సరుకు కొనుగోలు చేయవు. 







ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభమైన వెంటనే రూ. 400-500 వరకు పెరుగుదలకు అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ధరలు పెరిగే అవకాశం లేదు. ప్రస్తుత రబీ సీజన్లో 21, జనవరి వరకు దేశంలో శనగ పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 109.05 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 113.30 లక్షల హెక్టార్లకు చేరింది. 

ఆంధ్ర ప్రాంతపు పాత శనగలు ఈరోడ్ డెలివరీ రూ. 5250-5300, కర్నాటక ప్రాంతపు కొత్త సరుకు మదురై డెలివరీ రూ. 5500, ఈరోడ్ డెలివరీ రూ. 5450 ధరతో వ్యాపారమయింది. ఆంధ్ర ప్రాంతపు పాత శనగలు ఈరోడ్ డెలివరీ రూ. 5250-5300, కర్నాటక ప్రాంతపు కొత్త సరుకు మదురై డెలివరీ రూ. 5500, ఈరోడ్ డెలివరీ రూ.5450 ధరతో వ్యాపారమయింది. 

కర్నాటక లోని కలుబరిగిలో రూ. 4700-5000, సెడెంలో దినసరి 600-700 బస్తాల కొత్త శనగల రాబడిపై రూ. 4900-4925, బీజాపూర్లో 400-500 బస్తాలు, ముద్దె బిహాల్ లో 40-50 బస్తాలు, బిదర్లో 25-30 బస్తాల రాబడిపై రూ. 4700-5000, 

బళ్లారిలో జెజె రకం రూ. 4950, బెంగుళూరులో కర్నాటక ప్రాంతపు నాణ్యమైన గులాబీ శనగలు రూ.5800, లాతూరు ప్రాంత పు శనగపప్పు సార్టెక్స్ రూ. 5900, అకోలా సరుకు రూ. 5800 ధరతో వ్యాపారమయింది.

 ముంబాయిలో టాంజానియా శనగలు రూ. 100 తగ్గి రూ. 4600, రష్యా కాబూలీ శనగలు రూ. 4650-4700, సూడాన్ రూ. 5050- 5300, 

కోల్కత్తాలో రూ. 4700- 5000 ధరతో వ్యాపాం మయింది. అయితే,

 ఢిల్లీలో గతవారం 80-90 లారీల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5150-5175, మధ్య ప్రదేశ్ రూ. 5075,

 మహారాష్ట్రలోని సోలాపూర్లో అన్నగిరి రూ. 5100 -5300, మిల్లు రకం రూ. 4600 -4850, మెహకర్లో రూ. 4500- 4850, లాతూరులో విజయ మరియు అన్నగిరి రూ.4500 -4900, జల్గాంవ్లో బిల్జీ వ్యాపారం మిక్స్ రూ. 4850, చాపా రూ. 4950, లాతూరులో శనగలు లారీ బిల్జీ రూ. 4950-5000, అకోలాలో రూ. 5050, శనగపప్పు సార్టెక్స్ రూ. 6200 -6350, మీడియం రూ. 6150-6200 ధరతో వ్యాపారమయింది.


రాజస్థాన్ లో 4-5   వేల బస్తాల రాబడిపై రూ. 4600-4750 లోకల్ లూజు, జైపూర్ లో రూ. 5075-5125, శనగపప్పు రూ. 5775, మధ్యప్రదేశ్లోని అన్ని ఉత్పాదక కేంద్రాలలో కలిసి దినసరి 8-10 వేల బస్తాల రాబడిపై రూ. 4300-4850 మరియు 12-15 వేల బస్తాల కాబూలీ శనగల రాబడి పై నిమచ్లో రూ. 7500-8000 లోకల్ లూజు మరియు ఇండోర్ దేశీ రూ. 75 తగ్గి రూ. 5075, డాలర్ శనగలు రూ. 8000-8500, కాబూలీ 42-44 కౌంట్ రూ. 250 తగ్గి రూ. 8600, 44-46 కౌంట్ రూ. 8500, 58-60 కౌంట్ రూ. 7800, 60-62 కౌంట్ రూ. 7770, 6-64 కౌంట్ రూ. 7600, 64-66 కౌంట్ రూ. 7500 మరియు ఛత్తీస్ ఘడ్ లోని రాయిపూర్లో రూ. 4950-5050 ధరతో ధరతో వ్యాపారమయింది.


కర్నూలులో జెజె రకం రూ. 4900, ఒంగోలులో జెజె రూ. 4800, కాక్ టు కొత్త రూ. 6000, పాత రూ. 6100 మరియు డాలర్ శనగలు రూ. 7950 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog