కొబ్బరి అధిక ఉత్పత్తి - ధరలు పెరిగే అవకాశం లేనట్లే

 


02-01-2022

2016 తర్వాత 2019 నుండి వరుసగా ప్రతి సంవత్సరం కొబ్బరికాయల ఉత్పత్తి రాణించడం వలన సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమవుతున్నది. ఈ ఏడాది కూడా అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో పంట అత్యంత సంతృప్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది.దక్షిణాదిలో కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభమైనందున 2022 కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మద్దతు ధర రూ. 10,590 కి గాను కేరళలో తగ్గి రూ.9000 వద్ద ట్రేడవుతున్నది. ఇదే విధంగా కొబ్బరికాయ ధర రూ.32 ప్రభుత్వం నిర్ధారించగా రూ. 28-29 ధరతో విక్రయించబడుతున్నది. రాష్ట్రంలో జనవరి 5 నుండి కొబ్బరికాయలను కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పి. ప్రసాద్ తెలిపారు. 2022 ధరలు చౌకగా ఉన్నప్పుడు కొనుగోలు చేయడం మరియు ఇనుమడించిన తరుణంలో విక్రయించడం లాభదాయకంగా ఉండగలదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 


ప్రస్తుతం నెలకొన్న వాతావరణాన్ని పరిశీలిస్తే వచ్చే ఏడాది గణనీయమైన ఉత్పత్తి రాణించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, దీని సేద్యం అన్ని పంటల మాదిరిగా ప్రతీయేటా చేపట్టే అవసరం ఉండదు. ఒక మొక్కలు నాటిన తర్వాత అది వృక్షమై ప్రతియేటా కాయలు అందిస్తూనే ఉంటుంది. రెండు వారాల క్రితం కేంద్ర ప్రభుత్వం 2022 కోసం కొబ్బరి మద్దతు ధర ప్రతి క్వింటాలుకు రూ. 10,335 నుండి పెంచి 10,590 నిర్ధారించింది. దేశీయ మార్కెట్లో కొరవడిన కొనుగోళ్లు, గత ఏడాది మిగులు నిల్వలు అమ్మకం కాకుండా మూలుగుతున్నందున స్టాకిస్టులు కొనుగోలుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కేరళ ఫెడరేషన్ (కెరాఫెడ్) చే కొబ్బరి కొనుగోళ్లు శరవేగంతో చేపట్టాలని వ్యవసాయ డైరెక్టర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కొనుగోలు ప్రక్రియ పురోగమించేందుకు కనీసం ఒక నెల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఎందుకనగా, యంత్రాంగానికి అన్ని మౌళిక సదుపాయాలు కల్పించవలసి ఉండడమే ఇందుకు నిదర్శనం. కేరళలో 7 ల.హె.కు పైగా 2020-21లో 697.45 కోట్ల కొబ్బరికాయలు దిగుబడి వచ్చింది. గడిచిన రెండు సీజన్లలో గణనీయమైన ఉత్పత్తి రాణించినందున ఇప్పటికీ పాత సరుకు మార్కెట్లకు రాబడి అవుతుండగా, ఇప్పుడు ఒమిక్రాన్ మహమ్మారి పొంచివున్నందున స్థానిక డిమాండ్ తగ్గడమే కాకుండా సరఫరా పెరిగి కొబ్బరి ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. 2022 మొత్తం సంవత్సరంలో కొబ్బరి మరియు కొబ్బరి ఉత్పత్తులు 10 శాతానికి మించి వృద్ధి చెందే అవకాశం లేదు. 

ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో ప్రతి రోజు 80 టన్నుల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 8800-9000, మీడియం రూ.7600-8000, యావరేజ్ రూ. 7100-7200 మరియు పాలకొల్లులో 25 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, నాణ్యమైన పునాస రకం సరుకు రూ. 10,000, మీడియం రూ. 7500, యావరేజ్ రూ. 5500, నాణ్యమైన కొబ్బరికాయలు రూ. 8000, మీడియం రూ. 6500-7000, యావరేజ్ రూ. 4000-4500 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమైంది. 

కర్ణాటకలోని టిపూర్లో వారాంతపు సంతులో 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,800-18,200, కిరాణా రకం రూ. 20,000, కిరాణా రకం రూ. 13,400-13,600, మీడియం రూ. 11,800-12,000, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,000-10,500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, పంజాబ్, హర్యాణా కోసం రవాణా అవుతున్నది.

 అరిసేకేరి, సి.ఆర్. పట్నం మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 2 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 17,000-18,200, మీడియం రూ. 15,000-16,500, మిల్లింగ్ సరుకు రూ. 11,000-11,500 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని కాంగేయంలో సాదా రూ. 8500-8700, మిల్లింగ్ స్పెషల్ రూ. 9000-9200, మెరికో రూ. 9200 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 2000 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. “ : వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందురై ప్రాంతాల మార్కెట్లలో 2 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9770-10,500, మీడియం రూ. 8000-8600 మరియు 

కొచ్చి, త్రిచూర్లలో కొబ్బరి నూనె రూ. 15,200-15,300, పెరుందురైలో 5 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9640-11,100, కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 19,000-19,300, రాసి రూ. 10,400, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,550, బంతి కొబ్బరి రూ. 17,300, దిల్పసంద్ రూ. 10,850 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 30,000, వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 19,300, ఎండు సరుకు రూ. 13,300 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు