పెరిగిన శనగ సేద్యం

  

02-01-2022

 భారత్లోని ప్రముఖ శనగ ఉత్పాదక రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్లో దేశీ శనగ ధరలు స్థిరపడగా, కాబూలీ శనగలు రూ. 300-400 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. దక్షిణాది రాష్ట్రాలలో సంక్రాంతి డిమాండ్ నెలకొన్నందున పప్పు మిల్లుల కొనుగోళ్లు పెరిగి ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్, జమ్మలమడుగు ప్రాంతాలలో జెజె రకం శనగలు ఈరోడ్ డెలివరి రూ. 75 పెరిగి రూ. 5350-5375 మరియు కర్ణాటక సరుకు రూ. 5500, ట్యుటికోరిన్ ఓడరేవు వద్ద టాంజానియా దిగుమతి అయిన సరుకు రూ. 4850, ముంబైలో రూ. 4450-4550, రష్యా కాబూలీ శనగలు రూ. 4600-4650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని గదగ్, హుబ్లీ, ధార్వాడ్ ప్రాంతాలలో స్వల్పంగా కొత్త శనగల రాబడులు ప్రారంభమయ్యాయి. రాబడులు వృద్ధి చెందడానికి మరో 15 రోజులు పట్టవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత రబీ సీజన్లో డిసెంబర్ 31 దేశంలో శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 105.68 ల.హె. నుండి 2 శాతం వృద్ధి చెంది 107.69 ల.హె.కు విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. 


దిల్లీ లారెన్స్ రోడ్లో గత వారం 100-110 వాహనాల శనగల రాబడిపై రాజస్తాన్ సరుకు రూ. 5100, మధ్యప్రదేశ్ ప్రాంతపు సరుకు రూ.5000, మహారాష్ట్రలోని సోలాపూర్లో అన్నిగిరి రూ. 500-5200 మిల్లు రకం శనగలు రూ. 4600-4750, లాతూర్లో విజయ మరియు అన్నిగిరి శనగలు రూ. 4600-4900, అమరావతి, వాషిం, బుల్డనా ప్రాంతాలలో సాదా శనగలు రూ. 4300- 4750 లోకల్ లూజ్, అకోలాలో శనగలు లారీ బిల్టి రూ. 4825, పప్పు సార్టెక్స్ రూ. 6000-6200, మీడియం రూ. 5700-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్తాన్లోని మెడతా, కేక్, సుమేర్పూర్, బికనీర్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై రూ. 4400-4700 లోకల్ లూజ్, మధ్య ప్రదేశ్లోని నీమచ్, ఉజ్జయిని, దమోహ్, జబల్పూర్, పిపరియా, అశోక్నగర్ మార్కెట్లలో రూ. 4500-4750, కాబూలీ శనగలు రూ. 8000-8500, ఇండోర్ దేశీ సరుకు రూ. 5025-5050, డాలర్ శనగలు రూ.7500-8500, కాబూలీ శనగలు 42-44 కౌంట్ రూ. 9000, 44-46 కౌంట్ రూ. 8900, 58-60 కౌంట్ రూ. 8200, 60-62 కౌంట్ రూ. 8100, 62–64 కౌంట్ రూ. 8000, 64-66 కౌంట్ రూ. 7900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు