రబీ నూనెగింజల విస్తీర్ణంలో ఇంతవరకు వేరుశనగ విస్తీర్ణం గత ఏడాది మాదిరిగా 3.64 లక్షల హెక్టార్లు ఉండగా, అవిశె విస్తీర్ణం 2.57 లక్షల హెక్టార్లు, సన్ఫ్లవర్ 1.01 లక్షల హెక్టార్లు, కుసుమ 68000 హెక్టార్లు, నువ్వులు 30000 హెక్టార్లు మరియు ఇతర నూనెగింజల విస్తీర్ణం 33000 హెక్టార్లు ఉంది. అయితే, ప్రస్తుతం వనపర్తిలో వారంలో 2 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 6000-8200, 80-90 కౌంట్ రూ. 10000, 70-80 కౌంట్ రూ.11500, 60-70 కౌంట్ రూ. 12000 ధరతో వ్యాపారమై చిత్తూరు ఉత్పాదక కేంద్రాలలో విత్తనాలకోసం ఎగుమతి అవుతున్నది. ఎందుకనగా, ఈ ఏడాది భారీ వర్షాల వలన చిత్తూరు ప్రాంతంలో పంటకు నష్టం వాటిల్లడంతో రైతులు తిరిగి పంట విత్తవలసి వస్తున్నది.
వనపర్తిలో వారంలో 2 లక్షల బస్తాలు, గద్వాల తదితర ప్రాంతాలలో వారంలో 40-45 వేల బస్తాలు, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కళ్యాణదుర్గ, రాయదుర్గ, మడకశిర ప్రాంతాలలో వారంలో 60-70 వేల బస్తాలు, గుజరాత్ లోని రాజ్కోట్లో 80 వేల బస్తాలు, గోండల్, జూనాఘడ్ తదితర ప్రాంతాలలో 1 లక్ష బస్తాలు, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్యప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో కలిసి 40 వేల బస్తాలు, రాజస్తాన్లోని బికనీర్లో దినసరి 80వేలు - 1 లక్ష బస్తాలు, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు రాజస్తాన్లోని పరిసర మార్కెట్లలో కలసి దాదాపు 2 లక్షల బస్తాలు, కర్నాటకలోని బళ్లారి, గదగ్, చెల్లకేరి, చిత్రదుర్గ, లక్ష్మీశ్వర్, హుబ్లీ, రాయచూరు ప్రాంతాలలో గతవారం 95 వేలు - -1 లక్ష బస్తాల సరుకు రాబడి అయింది.
గద్వాల ప్రాంతంలో వేరుశనగ రూ. 5670-8210, నాణ్యమైన సరుకు హైదరాబాద్ డెలివరీ 60-65 కౌంట్ రూ. 11800, 60-70 కౌంట్ రూ. 11400, 80-90 కౌంట్ రూ. 10400, 90-100 కౌంట్ రూ. 10100, కళ్యాణి రూ.9000 ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం డెలివరీ వ్యాపారమయింది.
మహబూబ్ నగర్ లో 60-70 కౌంట్ వేరుశనగ గింజలు రూ. 11500, 90-100 కౌంట్ రూ. 10400, కళ్యాణి రూ. 8800 ధరతో వ్యాపారమయింది.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులలో నాణ్యమైన సరుకు రూ. 5600-7200, 80-90 కౌంట్ ( విత్తనాల కోసం) చెన్నై డెలివరీ రూ. 9700-9800, ఎడిబుల్ స్థానికంగా రూ. 9850-10000, కళ్యాణదుర్గ, రాయదుర్గ, మడకశిర ప్రాంతాలలో వారంలో 40-50 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5500-6700, మీడియం రూ. 5000-5500, నిమ్ము రకం రూ. 4500-5200, 80-90 కౌంట్ రెడీ సరుకు రూ. 9700-9800, చెన్నై కోసం ఎక్స్పోర్ట్ క్వాలిటీ రూ. 9900-10000, 70-80 కౌంట్ రూ. 10200-10400, మహారాష్ట్ర 60-70 కౌంట్ రూ.12000, 60-65 కౌంట్ రూ.13000-13500 ధరతో వ్యాపారమై పశ్చిమబెంగాల్, మహారాష్ట్రకోసం రవాణా అయింది.
గుజరాత్లోని రాజ్కోట్లో గతవారం 80 వేల బస్తాలు, డీసా, గోండల్, పాలన్పూర్, జూనాఘడ్ తదితర ప్రాంతాలలో వారంలో 1 లక్ష బస్తాల రాబడిపై తమిళనాడుకోసం విత్తనాల నిమిత్తం వేరుశనగ గింజలు ఓడరేవు డెలివరీ కళ్యాణి రూ. 8500, కొత్త టిజె 37 రకం 80-90 కౌంట్ రూ.9000, 50-60కౌంట్ రూ.9400, 60-70 కౌంట్ రూ. 9200, పోర్బందర్ డెలివరీ 50-55 కౌంట్ రూ.8500, 40-50 కౌంట్ రూ.8600 మరియు ముంబాయి డెలివరీ టిజె 37మరియు 60-70 కౌంట్ రూ. 9200, 50-60 కౌంట్ రూ. 10100, 60-65 కౌంట్ రూ. 10500 ధరతో వ్యాపారమయింది.
గుజరాత్లో వేరుశనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1250–1260, జామ్నగర్ రూ. 1260-1265 మరియు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలితూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో కలిసి 40 వేల బస్తాల రాబడిపై రూ. 4200-5200, 75-85 కౌంట్ స్థానికంగా రూ. 8400-8600, ఈరోడ్, విరూధనగర్ డెలివరీ రూ.8800-9000, ఆంధ్ర డెలివరీ రూ. 8800-8900 ధరతో వ్యాపారమయింది.
రాజస్తాన్లోని బికనీర్లో దినసరి 80 వేలు - 1 లక్షల బస్తాలు, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు రాజస్తాన్లోని పరిసర మార్కెట్లలో కలిసి దాదాపు 2 లక్షల బస్తాల రాబడిపై స్థానికంగా రూ. 5200-5600, 60-65 కౌంట్ వేరుశనగ గింజలు రూ. 7900-8000, 60-70 కౌంట్ రూ. 7900, 40-50 కౌంట్ రూ. 8200 ధరతో బీహార్, గుజరాత్, మహారాష్ట్ర కోసం రవాణ అయింది మరియు 80-90కౌంట్ ముంబాయి డెలివరీ రూ. 10500-10600 ధరతో వ్యాపారమయింది.
కర్నాటకలోని బళ్లారి, గదగ్, చెల్లకేరి, చిత్రదుర్గ, లక్ష్మీశ్వర్, హుబ్లీ, రాయచూర్ ప్రాంతాలలో గతవారం 95 వేలు-1లక్ష బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6500-7900, నిమ్ము రకం రూ. 4200-4500, మీడియం రూ.60006600, చెల్లకేరిలో కొత్త వేరుశనగ గింజలు 80-90 కౌంట్ రెడీ ( 9 శాతం ) రూ.9700-9800,కళ్యాణి రెడీ రూ. 8900, 90-100 కౌంట్ కొత్త రూ. 9950-10000 మరియు తమిళనాడులోని కొడుముడి, శేవూరు, దిండివనం, అవలూరిపేట, జయగొండం ప్రాంతాల మార్కెట్లలో కలిసి దినసరి 5000 బస్తాల రాబడిపై రూ.7000-7900, మీడియం రూ. 6200-6600, త్రిచంగోడ్లో గతవారం 2000 -2500 బస్తాల వేరుశనగ గింజుల రాబడిపై ప్రతి 240 కిలోల బస్తారూ. 16500-24300 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు