అప్రమత్తమవుతున్న బెల్లం స్టాకిస్టులు

 
09-01-2022

ఉత్తర ప్రదేశ్లో ఈ ఏడాది చెరకు ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నప్పటికీ దిగుబడులు కొరవడుతున్నందున బెల్లం తయారీ ప్రక్రియ కుంటుపడుతోంది. తద్వారా ముజఫర్ నగర్ శీతల గిడ్డంగులలో ఈ ఏడాది బెల్లం నిల్వలు గత ఏడాదితో పోలిస్తే 2 లక్షల బస్తాలు కొరత ఏర్పడినందున స్టాకిస్టులు ఒంటికాలిపై లేచి నిలుచున్నారు. భవిష్యత్తులో ధరలు ఇనుమస్తాయనడానికి ఇది ప్రబల నిదర్శనం. గుజరాత్, రాజస్తాన్, బీహార్, బెంగాల్, పంజాబ్, హర్యాణా లాంటి ప్రముఖ వినియోగ రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ బెల్లం విస్తృతంగా వినియోగమవుతుంది. ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్ర స్టాకిస్టులు ప్రస్తుత ధరలతో బెల్లం నిల్వ చేయడం లాభదాయకంగా ఉండగలదు. 


అయినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ధరలు ఇప్పటికీ చౌకగానే ఉన్నాయి. కొత్త సరుకు రాబడులు ప్రారంభమైన తక్షణమే ధరలకు మందగమనం పొడసూపగలదు గత వారం బెల్లం ఉత్పాదక కేంద్రాల వద్ద సంక్రాంతి పండుగ కోసం కిరాణా వ్యాపారుల డిమాండ్ నెలకొన్నందున ధర రూ. 100-150 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందగా మహారాష్ట్ర ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులకు అనుగుణంగా కొనుగోళ్లు లేనందున ధర రూ. 50-100 ప్రతి క్వింటాలుకు దిగజారింది.


ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ లోని శీతల గిడ్డంగులలో జనవరి 3న బెల్లం నిల్వలు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5,15,597 బస్తాల నుండి 1,98,096 బస్తాలు తగ్గి 3,17,501 బస్తాలకు పరిమితమయ్యాయి. ఇందులో చాకూబెల్లం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3,16,105 బస్తాల నుండి తగ్గి 2,23,011 బస్తాలు, పాప్ 43,690 నుండి 29,262, రస్కెట్ 25,822 నుండి 9294, కురుపా 7211 నుండి 3700, రాబటిన్ 1,46,004 నుండి 32, 467 బస్తాలకు పరిమితం కాగా, చదరాలు 18,165 బస్తాల నుండి పెరిగి 19,167 బస్తాల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.

 ముజఫర్ నగర్ లో గత వారం 35-40 వేల బస్తాల కొత్త బెల్లం రాబడిపై 40 కిలోలు చాకూ బెల్లం రూ. 1080-1220, కురుపా రూ. 1120-1125, లడ్డు బెల్లం రూ. 1240-1300, పౌడర్ బెల్లం రూ. 1280, రస్కట్ రూ. 940-980 మరియు పాపి 100 కిలోలు రూ. 2800-2860 లోజుకల్ లూజ్ మరియు హాపూర్లో 55-60 వాహనాల సరుకు రాబడి కాగా రూ. 1010-1110 ప్రతి 40 కిలోల ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని కరేలిలో గత సోమవారం నుండి శుక్రవారం వరకు 100-125 వాహనాల సరుకు రాబడిపై గులాబీ రకం రూ. 2600-2700, 

నర్సింగ్పూర్లో గురువారం 60-70 వాహనాలు రూ. 2600–2800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని సాంగ్లీలో గత వారం 25-30 వేల దిమ్మల కొత్త బెల్లం రాబడి కాగా, సురభి రకం రూ. 300-300, గుజరాత్ రకం రూ.3400-3650, ముంబై రకం రూ. 3400-3700, సోలాపూర్లో 20-22 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ.3100-3250, మీడియం రూ. 2900-3000, ఎరుపు- నలుపు మిక్స్ రూ. 2600-2650, లాతూరులో 25-30 వేల దిమ్మలు నాణ్యమైన సరుకు రూ. 2900-3000, ఎరుపు-నలుపు మిక్స్ రకం రూ. 2600-2650 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

కర్నాటకలోని మాండ్యాలో గత వారం 80-90 వాహనాల • సరుకు రాబడిపై ఎరుపు రకం రూ. 2850, సింగల్ ఫిల్టర్ రూ. 3000, డబుల్ ఫిల్టర్ రూ. 3100, చదరాలు రూ. 3350-3400, మహాలింగపూర్లో 8-10 వాహనాలు సురభి రకం రూ. 3000, మీడియం రూ.3250-3300, గుజరాత్ రకం రూ. 3350, చదరాలు రూ. 3400, అరకిలో ముక్కలు రూ.3500, 250 గ్రాముల ముక్కలు రూ. 3600, శిమోగాలో 18-20 వాహనాలు దేశీ బెల్లం రూ. 3500-3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గత వారం 40-45 వేల దిమ్మల కొత్త బెల్లం. గులాబీ రకం రూ. 3400-3500, మీడియం రూ. 3150-3200, నలుపు రూ. 2650-2700 మరియు చిత్తూరులో 18-20 వాహనాల ఎసి సరుకు రాబడిపై సురభి రకం రూ.3900-4000, సూపర్-ఫైన్ రూ. 2000, ట్నా రకం రూ.3500-3600, నలుపు రూ. 3050-310000 ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని సేలం మార్కెట్లో గత వారం 2-3 వేల బస్తాల బెల్లం రాబడిపై తెలుపు 30 కిలోలు రకం రూ.1300-1310, సురభి రకం సరుకు రూ. 1280 - 1300, ఎరుపు రకం రూ. 1270-1290 మరియు పిలకలపాలయంలో 4-5 వేల బస్తాలు తెల్ల బెల్లం రూ. 1260-1280, సురభి రకం రూ. 1240-1260, ఎరుపు రకం రూ. 1220-1240 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు